breaking news
Attempts
-
సీఐ కొట్టారు.. మేము బతకలేము
ప్రొద్దుటూరు క్రైం : ప్రజల ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కరించాల్సిన పోలీసులే ఇష్టానుసారం వ్యవహరించడమేగాక, ఫిర్యాదురాలి కుమారుడు, భర్తపై చేయిం చేసుకోవడంతో మనస్థాపంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు... స్థానిక ఈశ్వరరెడ్డి నగర్‌కు చెందిన సుకన్య పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తోంది. అక్కడ పనిచేసే ఏసోబుతో డబ్బు విషయమై గొడవ జరిగింది. సుకన్యకు చదవడం, రాయడం రాకపోవడంతో ఆమె అక్క లక్ష్మమ్మ, ఆమె భర్త విజయ్‌బాబు, కుమారుడు మహీధర్‌ను తీసుకుని ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు పత్రం ఇవ్వగా తీసుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన సుకన్య స్టేషన్ ఆవరణలోనే వాస్మాల్ ద్రావణం తాగింది. ఈ దృశ్యాలు మహీధర్ ఫోన్లో చిత్రీకరించడంతో సీఐ రామకృష్ణారెడ్డి అతడిపై చేయి చేసుకున్నాడు. బాలుడు ఏడ్వడంతో సీఐ వద్దకు వెళ్లి ‘బాబు తెలియక వీడియో తీశాడు తప్పైపోయింది వదిలేయండి’ అని చెప్పిన బాలుడి తండ్రి విజయ్‌బాబుపై సీఐ చేయి చేసుకున్నట్లు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ రెండు ఫోన్లను పోలీసులు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తన కళ్ల ముందే కుమారుడు, భర్తను కొట్టడంతో లక్ష్మమ్మ మనస్థాపం చెంది రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని కాపడారు. అయితే ఈ దృశ్యం కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇంటి వద్ద ఉన్న లక్ష్మమ్మ కుమార్తెలు చూశారు. అయితే డబ్బు విషయమై జరిగిన గొడవలో పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. విజయ్‌బాబు ఫిర్యాదు మేరకు ఏసోబు, ఆయన భార్య రాజమ్మ, కుమార్తె గీతికలపై కేసు నమోదు కాగా ఏసోబు ఫిర్యాదు మేరకు విజయ్‌బాబు, భార్య లక్షుమ్మ, అన్న కొడుకుపై కేసు నమోదు చేశామన్నారు.ఆందోళనతో అడిగితే హేళన చేశారుసామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో అందోళనగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాం. తమ తల్దిండ్రులు రైలు పట్టాలపై పడుకున్నట్లు వీడియో వచ్చిందని ఆరా తీయగా.. వారు హేళనగా మాట్లాడి పంపారు. కంప్లైంట్ తీసుకోం.. మీరే వెళ్లి వెతుక్కోపోండి పోలీసులు అన్నారు.– లక్ష్మమ్మ కుమార్తెలు శ్వేత, స్మాటీ, హారికనేను దూషించలేదుసుకన్య వాస్మాల్ తాగిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్ల కుండా వీడియో తీస్తుంటే మహిధర్‌ను కొట్టినట్లు చెప్పారు. సుకన్య ఫిర్యాదును తీసుకోమని చెప్పలేదని, లక్షుమ్మను దూషించలేదని, పోలీసులను భయపెట్టేందుకు ఆమె రైలు పట్టాలపై పడుకుందని సీఐ వివరణ ఇచ్చారు.– రామకృష్ణారెడ్డి, సీఐ -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): కడుపునొప్పి, చెవి నొప్పి భరించలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ ఎంపీపటేల్‌గూడకు చెందిన గడుసు మైత్రి (20) ఇబ్రహీంపట్నంలోని గురునా నక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, చెవినొప్పితో బాధపడుతోంది. సరైన చికిత్స అందడం లేదని మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
లొంగు‘బాట’లో దళ కమాండర్
ఛత్తీస్‌గఢ్: దండకారణ్యంలో మన్పూరు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత గాండ్ సింగ్ కొవాసి.. తన భాగస్వామితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నెల 8 నుంచి నక్సలైట్ సంస్థకు దూరంగా ఉన్నారని.. వారి కోసం మావోయిస్టులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గాండ్ సింగ్ జన జీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఛత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్ విభాగం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గాండ్ సింగ్ ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
ఢిల్లీ పోలీసు అరాచకం..
బులాంద్షహర్ః ఢిల్లీ పోలీసుల అరాచకం మరోమారు బయట పడింది. ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. తనతో లైంగిక సంబంధం పెట్టుకోమంటూ బలవంతపెడుతున్న ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ వేధింపులు తాళలేక సదరు యువతి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఢిల్లీ బులంద్‌షహర్ కు చెందిన సంగీత.. కానిస్టేబుల్ మంజిత్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాద పరిస్థితిలో ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అయిన 28 ఏళ్ళ మంజిత్.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని వెంటపడటంతో వేధింపులు తట్టుకోలేని సంగీత సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు సిటీ ఎస్పీ రామ్ మోహన్ సింగ్ తెలిపారు. ప్రమాద పరిస్థితిలో ఉన్న సంగీతను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారని, ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నయంగా ఉందని ఎస్పీ సింగ్ తెలిపారు. సంగీత తమ్ముడిని ఫాల్స్ కేసులో ఇరికించిన కానిస్టేబుల్ మంజిత్.. ఆమెపై వేధింపులకు పాల్పడటంతో సంగీత అటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందని ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మంజిత్ పై సెక్షన్ 354 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్పీ... ప్రస్తుతం నిందితుడు మంజిత్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
కుమారులతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్ (వరంగల్): తన ఇద్దరు కొడుకులపై అకారణంగా దొంగతనం నేరాన్ని మోపడంతో ఓ తండ్రి మనస్తాపం చెంది దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు..రెడ్యాల గ్రామానికి చెందిన దాసరి యాసయ్య (45) ఖమ్మంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ఖమ్మం వెళ్లి వస్తుంటాడు. యాసయ్యకు 7వ తరగతి చదివే సాయి, 4వ తరగతి చదివే ప్రభాకర్‌తోపాటు ఓ కుమార్తె కూడా ఉంది. సాయి, ప్రభాకర్‌లు తన ఇంట్లో రూ.12వేలు దొంగతనం చేశారంటూ ఐలబోయిన భద్రమ్మ వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురిచేసింది. సోమవారం ఖమ్మం వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన యాసయ్యకు విషయం తెలిసింది. ఎందుకు తన పిల్లలను హింసించావని భద్రమ్మను ప్రశ్నించాడు. తన ఇంట్లో రూ.12వేలు దొంగతనం చేశారని ఆమె చెప్పడంతో పిల్లల్ని నిలదీశాడు. వారు దొంగతనం చేయలేదని చెప్పారు. దీంతో తన పిల్లలపై అనవసరంగా దొంగతనం నేరాన్ని మోపారంటూ మనస్తాపం చెందిన యాసయ్య శీతల పానీయంలో పురుగుల మందు కలిపి సాయి, ప్రభాకర్లకు తాగించాడు. తర్వాత తానూ తాగాడు. స్థానికులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించేలోపే యాసయ్య మృతి చెందాడు. సాయి, ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
వనపర్తిలో బ్యాంక్ చోరీకి యత్నం
-
ట్రై చేద్దాం..!
అధికారుల ఊగిసలాట బదిలీ కోసం విశ్వప్రయత్నాలు తరచూ సెలవుపై వెళ్తున్న జిల్లా అధికారులు విభజన పర్వం ముగిసినా అధికారుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జిల్లాలోని ఉన్నతస్థాయిలోని ఉన్నవారు తమకు అనువైన ప్రాంతాలకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రభావం పాలనపై పడి వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులంతా ఇదే మూడ్‌లో ఉండడంతో ప్రజావసరాలకు ఇబ్బందులు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.. జిల్లాలోని ఉన్నతాధికారులు బదిలీపై దృష్టి సారించడంతో.. ఊగిసలాట మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన స్థా నాలకు వెళ్లాలన్న యోచనలో మరికొందరు జి ల్లా అధికారులు బదిలీల కోసం విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు. జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనువైన చోట్లకు బదిలీ చే యించుకునే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చ ర్చించుకుంటున్నాయి. ఆ కోవలోనే కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీకి వె ళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విసృ్తత ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన పొరుగు జిల్లాల్లోని కలెక్టర్లు కొందరిని బదిలీ చేయడం, పదోన్నతులు కల్పించడం వంటివి చేపట్టారు. అయితే మన జిల్లా కలెక్టర్ బదిలీపై ఏమాత్రం స్పష్టత లేకపోగా.. బదిలీపై వెళ్లనున్నట్లు ఊహగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మణ్కూడా మంచిస్థానానికి పదోన్నతిపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆయన సెలవుపై వెళ్లడం వెనుక ఇటువంటి ఉద్దేశమే ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌కు ఓఎస్డీగా మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంతరావును బదిలీ చేశారు. ఆయా శాఖల పరిధిలోని జిల్లా స్థాయి అధికారులు బదిలీ ధ్యాసలో ఉంటుండటంతో వాటి రోజువారీ పనితీరుపై సమీక్ష చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. తమకు అనుకూలంగా ఉండే అధికారులను జిల్లాకు రప్పించేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఢిల్లీస్థాయి నేత మన జిల్లాకు తమ అనుయాయుడైన కలెక్టర్‌ను రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు కూడా తాము చెప్పినట్లు నడుచుకునే ఆర్డీఓలు, ఎంపీడీఓలను తమ నియోజకవర్గాలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నారని, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఆ అధికారులు వీరి కనుసన్నల్లో మెలగాలన్న భావనతో అధికారులను బదిలీ చేయించుకునేందుకు దృష్టిపెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కొనసాగిన తహశీల్దార్ల పోస్టింగుల్లోనూ వివాదాలు చెలరేగాయి. జిల్లా స్థాయిలో కొత్త అధికారులు వచ్చాక తహశీల్దార్ల పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని రెవిన్యూ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్తంభించిన పాలనజిల్లా స్థాయి అధికారులు కొంతమంది ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు జవాబు లేదు. దీంతో అధికారులు బదిలీలపై దృష్టి పెట్టడంతో క్షేత్రస్థాయిలో పాలన కొంతమేరకు స్తంభించిపోయింది. కొన్ని శాఖల పరిధిలో పురోగతి శూన్యమైంది. కనీసం కొంతమంది అధికారుల బదిలీలు చేసినా పాలన గాడిలో పడేందుకు వీలుదొరికేది.. అలా కాకుండా బదిలీ చేస్తారని తెలిసినా చేయకపోవడంతో పనులు చేసుకోవడం కష్టంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి పనుల విషయం మరుగును పడిపోతోంది. -
మహిళను కిడ్నాప్ చేయబోయిన ఆటోడ్రైవర్