లొంగు‘బాట’లో దళ కమాండర్

Maoist Leader Gond Singh Kovasi Attempts Surrender - Sakshi

ఛత్తీస్‌గఢ్: దండకారణ్యంలో మన్పూరు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత గాండ్‌ సింగ్‌ కొవాసి.. తన భాగస్వామితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నెల 8 నుంచి నక్సలైట్‌ సంస్థకు దూరంగా ఉన్నారని.. వారి కోసం మావోయిస్టులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గాండ్‌ సింగ్‌ జన జీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఛత్తీస్‌గఢ్ ఇంటలిజెన్స్‌ విభాగం విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం గాండ్‌ సింగ్‌ ఇప్పుడు ప్రధాన జీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top