చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య | 10th class student Attempts To Ends Her Life In Visakhapatnam | Sakshi
Sakshi News home page

చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య

May 31 2025 12:07 PM | Updated on May 31 2025 12:07 PM

10th class student Attempts To Ends Her Life In Visakhapatnam

మర్రిపాలెం(విశాఖపట్నం): జ్ఞానాపురం గెడ్డ వీధికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. కిరణ్మయి (15) తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే బాలికను చెల్లెళ్లు నిత్యం ఏదో ఒక విషయంపై ఆటపట్టిస్తుండటంతో.. శుక్రవారం ఇంట్లో ఉన్న బాత్రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

 ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో లేరు. కొంతసేపటికి ఆమె తాత ఇంటికి రావడంతో, అక్క ఎక్కడికో వెళ్లిపోయిందని వారు అతనికి చెప్పారు. అంతా వెతికి, చివరికి బాత్రూమ్‌ తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్మయి విగతజీవిగా కనిపించింది. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా బాలిక తండ్రి ఎండాడలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా, తల్లి గౌరి నగరంలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement