టీకా వేసుకున్న అంగన్‌వాడీ ఆయా మృతి

Anganwadi Worker Eliminated After Taking Coronavirus Vaccine In Mancherial; - Sakshi

సాక్షి, మంచిర్యాల : కరోనా వ్యాక్సిన్‌ తీసు​కున్న ఓ అంగన్‌వాడీ ఆయా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ సంఘటన కాసిపేట మండలం ముత్యంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, ముత్యంపల్లి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా సుశీల ఈ నెల 19న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. అప్పటినుంచి జ్వరం వస్తుండటంతో ఆసుపత్రిలో చూపించుకుంది. అయినప్పటికి జ్వరం తగ్గక శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో 28న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరింది. అక్కడ పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆమె మరణించింది.
( ‘వ్యాక్సిన్‌’ స్పెషలిస్ట్.. నాడు, నేడు ఆయనదే కీలక పాత్ర )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top