తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా | 10 Officers Got IAS Rank In Telangana Here Is the list | Sakshi
Sakshi News home page

తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా

Feb 7 2023 7:37 PM | Updated on Feb 7 2023 7:51 PM

10 Officers Got IAS Rank In Telangana Here Is the list - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు  ఐఏఎస్‌ హోదా లభించింది. ఐఏఎస్‌ హోదా పొందిన వారిలో.. కాత్యాయని, చెక్కా ప్రియాంక నవీన్‌ నికోలస్‌, కోరం అశోక్‌ రెడ్డి, బడుగు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకటనరసింహ రెడ్డి, అరుణ శ్రీ, హరిత, కోటా శ్రీవాస్తవా, నిర్మల కాంతివేస్లీ ఉన్నారు.

ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
మరోవైపు తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్‌ పరిపాలన డీసీపీగా యోగేశ్‌ గౌతమ్‌, సీఐడీ ఎస్పీగా ఆర్‌ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. 

పీసీఎస్‌ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్‌ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్‌, వరంగల్‌ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా 91 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎగ్జామ్‌ డేట్స్‌ ఇవే!

Advertisement
 
Advertisement
Advertisement