Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఎగ్జామ్‌ డేట్స్‌ ఇవే!

Telangana Common Entrance Test Schedule Released Check Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. 

ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్‌ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల షెడ్యూల్‌ కింది విధంగా ఉంది. 

► మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష.
► మే 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీలు.
► మే 18న టీఎస్‌ ఎడ్‌ సెట్‌
►మే 20న టీఎస్‌ ఈసెట్‌
► మే 25న లాసెట్‌(ఎల్‌ఎల్‌బీ), పీజీ లాసెట్‌
► మే 26, 27న టీఎస్‌ పీజీ ఐసెట్‌
►మే, 29 నుంచి జూన్‌ ఒకటి వరకు పీజీ ఈసెట్‌య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చదవండి: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top