వేలూరు : విద్యతో పాటూ చిన్నారులకు క్రీడలపై ఆసక్తిని పెంచాలని కలెక్టర్ లీల అలెక్స్ అన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 138వ జయంతిని పురస్కరించుకొని వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమంలో కలెక్టర్ చిన్నారులతో కలిసి చిన్నారుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ వేషాలు ధరించిన చిన్నారులతో పాటూ డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే వేలూరు అన్నారోడ్డులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ అద్వక్షులు వాహీద్‌బాషా అద్యక్షతన నెహ్రూ చిత్ర పటానికి పూల మాల వేసి స్వీట్లు పంచి పెట్టారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు సెల్వకుమార్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


