●అన్నామలై ఆందోళన ●వి ది లీడర్స్ సమగ్ర మహిళా విధాన పత్రం విడుదల
సాక్షి, చైన్నె: ప్రపంచ తమిళ సమాఖ్య (వరల్డ్ తమిళ ఫెడరేషన్) నాయకుడు పి.నెడుమారన్ కుమారుడు మాణిక్యం నెడుమారన్ (57) శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కన్నుమూశారు. చిన్న వయసులోనే బౌద్ధమతాన్ని స్వీకరించిన ఆయన సన్యాసిగా జీవితాన్ని గడుపుతున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స ఫలించకపోవడంతో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8:45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి మెల్బోర్న్లోనే బౌద్ధ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. పాస్పోర్ట్ నిలిపివేత (పాస్పోర్ట్ జప్తు) కారణంగా నెడుమారన్ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయారని, దీంతో తమ కుమారుడి చివరి చూపునకు, అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి ఏర్పడిందని ప్రపంచ తమిళ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.


