బెంగళూరుకు రజనీకాంత్‌ | - | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు రజనీకాంత్‌

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

– ఆస్పత్రిలో సోదరునికి పరామర్శ

సాక్షి, బెంగళూరు: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ గురువారం బెంగళూరుకు వచ్చారు. రాజరాజేశ్వరినగరలో ఉన్న కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ను పరామర్శించారు. గైక్వాడ్‌ నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి అదుపుతప్పి పడిపోయారు. ఆయన తలభాగానికి దెబ్బ తగిలి రక్తస్రావం అయింది. దీంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. ఆయన కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కళ్లు తెరవలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ రజనీకాంత్‌ వచ్చి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. తరువాత కనకపుర రోడ్డులోని రవిశంకర్‌ గురు ఆశ్రమానికి వెళ్లి కొంతసేపు గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement