సాక్షి, చైన్నె: చిన్నపిల్లల గుండె సంరక్షణకోసం చైన్నెలోని ఎగ్మోర్‌లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్(ఐసిహెచ్)కు రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాసు, కామరాజర్ పోర్టు సంయుక్తంగా రూ.1.45కోట్లు విలువచేసే అత్యాథునిక వైద్య పరికరాన్నిసమకూర్చారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న కామరాజర్ పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐరీన్ సింథియా , గౌరవ అతిథిగా పాల్గొన్న ఐసిహెచ్ డైరెక్టర్ డాక్టర్ వి పూవళిగి చేతులమీదుగా సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా వివిడ్ ఈ95 4డి ఎకో కార్డియోగ్రఫీ మిషన్‌ను ఆసుపత్రి అధికారులను అందజేశారు.


