ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేయాలి

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

వేలూరు: ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేయడంలో అధికారులు ఆలసత్యం వహించరాదని వేలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి విజయ్‌ బాలాజీ తెలిపారు. గురువారం ఉదయం వేలూరు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను కలెక్టర్‌ లీల అలెక్స్‌ అధ్యక్షతన తనిఖీ చేశారు. అదే విధంగా కార్పొరేషన్‌లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎటువంటి ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అనే వాటిపై నేరుగా వెళ్లి పరిశీలించారు. అనంతరం రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ కార్డు దారులకు ఎటువంటి వస్తువులను అందజేస్తున్నారు, నిత్యావసర వస్తువులు నాణ్యతగా ఉందా అనే విషయంపై లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం వివిద శాఖలపై వేలూరు కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ పథకాలతో పాటు రుణ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధాకర్‌, వినోద్‌ కన్నన్‌, సింధుతో పాటూ జిల్లా రెవెన్యూ అధికారి సురేష్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement