సాక్షి, చైన్నె: తమిళనాడులోనే అతిపెద్ద విద్యార్థి స్టార్టప్ సదస్సుగా పేరుగాంచిన ఈశ్వరి స్టార్టప్ పెరవై 2026 గురువారం ప్రారంభమైంది. శుక్రవారం కూడా ఈ సదస్సు జరగనున్నది.ఆర్. శివకుమార్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల పారిశ్రామిక ఉత్సవంలో రూ1 కోటి నిధుల పెట్టుబడి సాధించడమే కాకుండా, విద్యార్థి పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యాపార ఆలోచనలను ప్రదర్శించడానికి ఒక అద్భుత వేదికగా నిలిచింది.ముఖ్య అతిథి పి. మథన్ రాజా గారు ఈ సదస్సును ప్రారంభించారు.తమిళనాడు ప్రభుత్వ స్టార్టప్‌టీఎన్ ఛైర్మన్ సింగై జి. రామచంద్రన్, ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ డైరెక్టర్ శరత్ నంబియార్‌లతో పాటు 100 మందికి పైగా పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శివకుమార్, ఈశ్వరి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దైవ సుందరిసమక్షంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థుల ప్రతిభను చాటేప్రదర్శనలు, స్టార్టప్ అంచనాలతో కూడిన వివిధ అంశాలను కొలువు దీర్చారు.
ఈశ్వరి స్టార్టప్ పెరవై మొదటి రోజున విద్యార్థుల కోసం వివిధ రకాల పోటీలు, వర్క్‌షాప్‌లు నిర్వహించింది. చైన్నె యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో హ్యాకథాన్. స్టార్టప్ పిచ్ షోకేస్ ద్వారా విద్యార్థులు తమ ఐడియాలను పెట్టుబడిదారులకు వివరించారు.


