– రూ. 30 లక్షలు ప్రకటించిన సీఎం
సాక్షి, చైన్నె : జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల స్క్వాష్ టీమ్ విభాగంలో తమిళనాడుకు చెందిన జోష్నా చిన్నప్ప, షమీనా రియాజ్ కాంస్య పతకాలు సాధించి సంచలనం సృష్టించారు.పతకాలు సాధించిన క్రీడాకారిణులకు సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ‘పట్టుదల, ఆత్మవిశ్వాసంతో వీరు సాధించిన ఈ విజయం తమిళనాడు క్రీడా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిందని సీఎం విజయ్ వ్యాఖ్యానించారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు.ప్రపంచ వేదికపై తమిళనాడు, భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేస్తూ భవిష్యత్తులో వీరు మరెన్నో ఘనతలను సాధించాలని సీఎం ఆకాంక్షించారు.


