మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ అండ్‌ రైజ్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ అండ్‌ రైజ్‌

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

సాక్షి, చైన్నె : మహిళా పారిశ్రామిక వేత్తల కోసం వీ అండ్‌ రైజ్‌ వేదిక ఏర్పాటైంది. ఇందులో భాగస్వాములుగా ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంకింగ్‌, పీఎస్‌జీసీఏఎస్‌, ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ వ్యవహరిస్తున్నారు. కోయంబత్తూరులో మహిళా పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చేయడానికి ఆరు నెలల ప్రత్యేక ఇంక్యుబేషన్‌ , ఫైనాన్షియల్‌ ఎనేబుల్మెంట్‌ కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు. కోయంబత్తూరుకు చెందిన 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఈ తొలి విడత ఇంక్యుబేషన్‌ కోసం ఎంపిక చేశారు. అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలకు గొప్ప వ్యాపార ఆశయాలు ఉన్నప్పటికీ.. వృద్ధి మూలధనం, సరైన మార్గదర్శకత్వం, చిన్న స్థాయిలోనే ఉండిపోతున్నారని, ఈ లోటును పూడ్చడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రకటించారు. డిజిటల్‌ బుక్‌కీపింగ్‌, ఆర్థిక రికార్డులను మెరుగుపరచడం, అధికారిక బ్యాంక్‌ రుణాలు పొందడం, మార్కెట్‌ అనుసంధానం వంటి అంశాలపై ఆరు నెలల పాటు వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌, వన్‌–టూ–వన్‌ మెంటరింగ్‌ అందిస్తారు. కార్యక్రమంలో ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంకింగ్‌ సౌత్‌ ఏసియా రీజినల్‌ హెడ్‌ కల్పనా అజయ్‌ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఎదుర్కొనే ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు, సంస్థాగత మార్గాలను కూడా పరిశోధించి నివేదిక రూపంలో రూపొందించనున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement