చేతివృత్తుల వారికి సాంకేతిక అండ | - | Sakshi
Sakshi News home page

చేతివృత్తుల వారికి సాంకేతిక అండ

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

● ఐఐటీ మద్రాస్‌, హ్యూమన్‌ వెల్ఫేర్‌ భాగస్వామ్యం

సాక్షి, చైన్నె: భారతదేశంలోని భౌగోళిక గుర్తింపు(జీఏ) ట్యాగ్‌ ఉన్న హస్తకళలు, ఉత్పత్తుల ప్రామాణీకరణ ట్రేసబిలిటీ (జాడను గుర్తించడం) ద్వారా చేతివృత్తులవారికి సాధికారత కల్పించేందుకు ఐఐటి మద్రాస్‌, హ్యూమన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి, డీన్‌ ప్రొఫెసర్‌ మను సంతానం, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్‌ ఎం. మణివన్నన్‌, ప్రొఫెసర్‌ జాన్‌ అగస్టిన్‌ సమక్షంలో.. హెచ్‌డబ్ల్యుఏ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ రజనీకాంత్‌ ఈ అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు.

ప్రయోజనాలు..

జీఐ–ట్యాగ్‌ ఉన్న ఉత్పత్తుల అసలు రూపాన్ని, నాణ్యతను వినియోగదారులు సులభంగా ధృవీకరించుకోవడానికి డిజిటల్‌ ప్రామాణీకరణ పద్ధతులు ఉపయోగపడతాయి. కళాకారులు, నేత కార్మికులు, రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక స్థిరత్వం చేకూర్చడంతో పాటు వారి సాంస్క్కృతిక గుర్తింపు కాపాడబడుతుంది. ఐఐటి మద్రాస్‌లోని ఈ ప్రత్యేక ల్యాబ్‌ ద్వారా చేతివృత్తులవారు ఎదుర్కొనే సవాళ్లకు వినూత్న సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేయబడతాయి. ప్రొఫెసర్‌ ఎం. మణివన్నన్‌ (ఐఐటి మద్రాస్‌) ఈసందర్భంగా మాట్లాడుతూ, దేశంలో రెండవ అతిపెద్ద జనాభాగా ఉన్న చేతివృత్తుల వారికి సాంకేతికతతో సాధికారత కల్పించడం ద్వారా వికసిత్‌ భారత్‌ దార్శనికతను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. డాక్టర్‌ రజనీకాంత్‌ (జీఐ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా) మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌ జాతీయ స్థాయిలో విస్తరించి దీర్ఘకాలంలో లక్షలాది మంది కళాకారులు, రైతులు , మహిళలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement