జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

● పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ నిరసన

సాక్షి, చైన్నె : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ప్రధాని మోదీ, అమిత్‌షాపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ పార్టీ నిరసన చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రులు కందస్వామి, షాజహాన్‌, కాంగ్రెస్‌ పార్టీ సభ్యులతో సహా పలువురు పాల్గొన్నారు. ఎన్నికల విభాగాన్ని, ఓట్ల రిగ్గింగ్‌ను ఖండిస్తూ నినాదాలు చేశారు. మాజీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ను ప్రకటించిన గత ఏడాది కాలంగా ఓటర్ల జాబితాలో ఓట్ల రిగ్గింగ్‌ జరుగుతోందని తెలిపారు. అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపిస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన 3 నెలల పాటు రోడ్‌ షో చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు, ఓట్ల రిగ్గింగ్‌ జరిగినట్లు ఆధారాలతో సహా రుజువైందన్నారు. ఇప్పటి వరకు 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని, ఇది ఒక ఘోరమైన ప్రజాస్వామ్య వధ అని ఆరపించారు. గోవా రాష్ట్రంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 97 మందిని తొలగించారని వివరించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు కూడా ఇందులో ఉన్నాయని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement