అక్టోబర్‌ 13న దళితులతో ఆలయ ప్రవేశం | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 13న దళితులతో ఆలయ ప్రవేశం

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

సాక్షి, చైన్నె : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి సమీపంలోని తిరుచానూరు పద్మావతి ఆలయంలోకి అక్టోబర్‌ 13న దళితులతో ప్రవేశించనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్‌ ప్రకటించారు. ఆయన శుక్రవారం చైన్నె ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. చైన్నె పురసైవాక్కం ఎస్సీ వర్గానికి చెందిన చిన్నప్ప కుమారుడు మురుగున్‌ 1925 అక్టోబర్‌ 13న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకమని ఆరోపిస్తూ ఆర్టికల్‌ 295 ఐపీసీ సెక్షన్‌ కింద ఆయనను అరెస్టు చేసి తిరుపతి సబ్‌ జైలులో ఉంచారని తెలిపారు. దీనిపై అప్పటి సీఎం రాజాజీని విస్మయం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మహాత్మా గాంధీ తిరుపతికి చేరుకుని దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని సత్యాగ్రహం చేసి 33 మంది దళితులను వెంటబెట్టుకుని పద్మావతి అమ్మవారి ఆలయ ప్రవేశం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్‌ 13వ తేదీన 33 మంది దళితులతో కలిసి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నట్టు తెలిపారు. ఇందులో ఏ రాష్ట్రానికి చెందిన దళితులైన పాల్గొనవచ్చునని పిలుపునిచ్చా రు. ఎస్సీలు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అభివృద్ధి చెందితేనే తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు.

డీలిమిటేషన్‌తో దేశానికి ముప్పు

ప్రస్తుతం లోకసభలో ఉన్న సీట్ల సంఖ్యను 543 నుంచి 800లకు పెంచాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోందని చింతా మోహన్‌ తెలిపారు. అదే జరిగితే జకోస్లేవియా దేశంలాగే భారత్‌ చిన్నాభిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement