ఔషధ ఆవిష్కరణలకు అధునాతన 3డీ విధానం | - | Sakshi
Sakshi News home page

ఔషధ ఆవిష్కరణలకు అధునాతన 3డీ విధానం

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

సాక్షి, చైన్నె : చైన్నె కాటాన్‌ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ ఆధ్వర్యంలో శుక్రవారం సెల్లింక్‌ సంస్థ సహకారంతో అధునాతన 3డీ బయోప్రింటింగ్‌ టెక్నాలజీపై ఒకరోజు ప్రత్యేక వర్క్‌షాప్‌, హ్యాండ్స్‌–ఆన్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఔషధ ఆవిష్కరణల కోసం అధునాతన 3డీ బయో ప్రిటింగ్‌ విధానం గురించి సమగ్రంగా వివరించారు. ఫార్మసీ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి 45 మంది ప్రతినిధులు శిక్షణలో పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ఎం ఫార్మసీ కాలేజ్‌ డీన్‌ డాక్టర్‌ వి.చిత్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఫార్మాస్యూటికల్‌, బయోమెడికల్‌ రంగాల్లో ఆధునిక సాంకేతికతలతో వస్తున్న మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. సెల్లింక్‌ అప్లికేషన్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ విజేత జైస్వాల్‌ సెల్లింక్‌ బయో ఎక్స్‌ బయోప్రింటర్‌ పనితీరు, బయోఇంక్స్‌, 3డీ సెల్‌ కల్చర్‌, టిష్యూ ఇంజినీరింగ్‌ తదితర అంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.సుమిత్ర పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశోధనల్లో 3డీ బయోప్రింటింగ్‌ పాత్రపై విద్యార్థులకు చక్కటి అవగాహన లభించిందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement