సరికొత్త మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సరికొత్త మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్ల ఆవిష్కరణ

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

సాక్షి, చైన్నె : ప్రొఫెషనల్‌ కార్యాలయాలు, ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌, రిటైల్‌, విద్యా రంగాల అవసరాల కోసం ప్రముఖ డిజిటల్‌ ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ కానన్‌ ఇండియా సరికొత్త ఇమేజ్‌ ఫ్రోగ్రాఫ్‌ టీఎం సిరీస్‌లో లార్జ్‌–ఫార్మాట్‌ ప్రింటర్లు, మల్టీఫంక్షన్‌ ప్రింటర్లను స్థానికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా కానన్‌ సంస్థ తొలిసారిగా అంతర్నిర్మిత లార్జ్‌–ఫార్మాట్‌ స్కానర్లతో కూడిన టీఎం–5610 ఎం (36–అంగుళాలు), టీఎం –5510ఎం (24–అంగుళాలు) మల్టీఫంక్షన్‌ ప్రింటర్లను పరిచయం చేసింది. ఇవి ప్రింటింగ్‌, స్కానింగ్‌ రెండింటినీ ఒకే కాంపాక్ట్‌ పరికరంలో అందిస్తాయి. 5–రంగుల పిగ్మెంట్‌ ఇంక్‌తో పాటు, గాఢమైన నలుపు రంగు, పదునైన గీతల కోసం సరికొత్త మ్యాట్‌ బ్లాక్‌ పిగ్మెంట్‌ ఇంక్‌ను ఇందులో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు తోషియాకి నోమురా, సీనియర్‌ డైరెక్టర్‌ పునీత్‌ దత్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement