– మద్రాస్ హైకోర్టు నిర్ణయం
సాక్షి, చైన్నె : రాజకీయ కారణాలతో తమ పదవులకు రాజీనామా చేసే ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని, అలాగే ఉప ఎన్నికల ఖర్చులను వారే భరించేలా చట్ట సవ రణ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలోకి చేరిన విషయం తెలిసిందే. ఇందులో రెండు స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఎన్నికలైన కొద్దికాలానికే ప్రజల తీర్పును విస్మరించి రాజీనామా చేస్తున్న ఎమ్మెల్యేలు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్లపాటు నిషేధం విధించాలని, ఎన్నికల ఖర్చులను వారే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని చైన్నెకి చెందిన న్యాయవాది సుధన్ కోర్టును ఆశ్రయించారు.అదే సమంయలో ఎన్నికల ఫలితాలు వెలువడిన త ర్వాత వాటిలో తమకు ఎలాంటి పాత్ర ఉండదని, ఈ అంశంపై కోర్టు జోక్యం చేసుకోలేవని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు పేర్కొ న్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానాలు చట్టాలను సవరించలేవు అని పేర్కొంటూ, చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేస్తూ పిటిషన్ విచారణను తోసిపుచ్చారు.


