సాక్షి, చైన్నె: భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ–ఇన్‌న్‌చార్జ్‌లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది. ఇందులో భాగంగా తమిళనాడు బీజేపీ ఇన్‌చార్జ్‌లుగా ఇప్పటివరకు కొనసాగిన అరవింద్ మీనన్, సుధాకర్ రెడ్డి స్థానంలో అనుభవజ్ఞులైన నేతకు బాధ్యతలు అప్పగించారు. ఏళ్ల తరబడి వ్యవ హరించిన ఆ ఇద్దర్నీ తాజాగా పక్కన పెట్టారు. కొత్త ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించారు.
రామ్ మాధవ్‌కు కీలక బాధ్యతలు
పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్‌ను తమిళనాడు బీజేపీ కొత్త ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయనకు సహాయకులుగా నిర్మల్ కుమార్ సురానా, డి.కె. అరుణను కొత్త సహ–ఇన్‌చార్జ్‌లుగా కేటాయించారు. సురానా ఇది వరకు పుదుచ్చేరి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఇక, డీకే అరుణ తెలంగాణకు చెందిన నేత, ఎంపీ కావడం గమనార్హం. తమిళనాడు ఇన్‌చార్జ్‌గా ఉన్న అరవింద్ మీనన్‌ను ఉత్తరాఖండ్ సహ–ఇన్‌చార్జ్‌గా బదిలీ చేశారు. ఇక, తమిళనాడుకు చెందిన వానతీ శ్రీనివాసన్‌ను ఆంధ్రప్రదేశ్ సహ–ఇన్‌చార్జ్‌గా పంపించారు. తమిళనాడు రాజకీయ రంగంలో కొత్త సమీకరణాలు మారుతున్న తరుణంలో, వ్యూహకర్తగా పేరున్న రామ్ మాధవ్‌ను రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
26 నుంచి
త్రైమాసిక సెలవులు
– పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
తిరువొత్తియూరు: తమిళనాడు రాష్ట్ర సిలబస్ పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 4 వరకు త్రైమాసిక పరీక్షల సెలవులు ప్రకటించా రు. అలాగే ఈ సెలవు దినాల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని పాఠశాల విద్యా శాఖ కచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులోని ప్రభు త్వ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 4 వరకు ఈ త్రైమాసిక సెలవులు వర్తిస్తాయి.ఇందు కు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న వివరాలు త్రైమాసిక పరీక్షల సెలవుల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై నిషేధం విధించారు. ఈ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా ప్రత్యేక తరగతులు నిర్వహించి, అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే దానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరీక్షలు రాసిన విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకే సెలవులిచ్చినట్లు స్పష్టం చేశారు.
అల్పాహారంలో బల్లి
– 40 మంది విద్యార్థులకు అస్వస్థత
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కొట్టయూరులో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉంది. ఇక్కడ 1 నుంచి 8 తర గతి వరకు 54 మంది విద్యార్దులు చదువుతున్నా రు. కాగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గతంలో 1 నుంచి 5 వరకు చదివే విద్యార్దులకు ఆల్పాహరం అందించారు. అయితే టివీకే ప్రభు త్వం ఏర్పాడ్డాక ఆల్పాహారం పథకాన్ని 8 తరగతి వరకు చదివే విద్యార్దులకు వర్తింప చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 8.30 గంటలకు కొట్టయూరు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రవ్వకిచ్చడిని ఆల్పాహారంగా అందించా రు. అయితే అల్పాహారం తీసుకున్న నిమిషాల్లోనే విద్యార్థులకు ఆస్వస్థతకు గురి కావడంతో పాట వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు అప్ర మత్తమయ్యారు. వెంటనే 108 ద్వారా తిరువళ్లూ రు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచా రం అందుకున్న కలెక్టర్ కవిత వెంటనే వైద్యశాల కు చేరుకుని బాధిత విద్యార్థులను పరామర్శించా రు. అనంతరం కొట్టయూరు ప్రాంతానికి వెళ్లి వంటగది, వస్తువులను పరిశీలించారు. సిబ్బంది నిర్ల క్ష్యమే అస్వస్థతకు కారణమని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
పల్లికరణైకు విదేశీ పక్షుల రాక
తిరువొత్తియూరు: చైన్నె పల్లికరణై చిత్తడి నేల ప్రాంతానికి వలస వచ్చే పక్షుల జాబితాలో కొత్తగా ఒక అరుదైన పక్షి వచ్చి చేరింది. ’టెరెక్ సాండ్‌పైపర్’ అని పిలిచే ఈ అరుదైన నీటి పక్షి జంట ఇక్కడికి చేరుకుంది. దీంతో ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పక్షి జాతుల సంఖ్య 205కు పెరిగింది. సైబీరియా, వాయవ్య యూరప్ , మధ్య ఆసియా వంటి సుదూర ప్రాంతాల నుండి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఈ పక్షులు శీతాకాలంలో బస చేయడానికి ఇక్కడికి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గత 40 ఏళ్ల క్రితం పాయింట్ కాలిమెర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో, ఆ తర్వాత రామనాథపురంలో ఈ టెరెక్ సాండ్‌పైపర్ పక్షులను గుర్తించినట్లు చారిత్రక రికార్డులు ఉన్నాయి.


