ఏఐతో డీఎంకే పుస్తకాల అవినీతి | - | Sakshi
Sakshi News home page

ఏఐతో డీఎంకే పుస్తకాల అవినీతి

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

● తమ పాలనలో ఒక్క పుస్తకం కూడా కొనలేదు ● పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌

సాక్షి, చైన్నె: పెరియార్‌ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయానికి నకిలీ పుస్తకాల కొనుగోలు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి సృష్టించిన నకిలీ పుస్తకాలను కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. భారతదేశంలోనే తొలిసారిగా గ్రంథాలయాల పుస్తకాల కొనుగోలులో డీఎంకే ప్రభుత్వం ఏఐ ద్వారా అవినీతికి పాల్పడిందని మంత్రి ఆరోపించారు. చైన్నెలోని కన్నెమర లైబ్రరీతో పాటు కోయంబత్తూరులోని పెరియార్‌ విజ్ఞాన కేంద్రం, గ్రంథాలయానికి ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ పుస్తకాలను, నకిలీ రచయితల పేర్లతో కొనుగోలు చేసి కార్డ్‌బోర్డ్‌ పెట్టెలలో ఉంచారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క పుస్తకం కూడా కొనుగోలు చేయలేదని, గత డీఎంకే పాలనలోనే మార్చి 14న ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగాయని స్పష్టం చేశారు.

ప్రత్యేక కమిటీ – డోలాయమానం

ఈ గ్రంథాలయ కుంభకోణంపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొత్తం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నకిలీ పుస్తకాలు అచ్చెరువొందేలా ఒకే వ్యక్తి 2–3 ప్రచురణ సంస్థలను నడుపుతూ సరఫరా చేశాడని, నకిలీ రచయితలను గుర్తించి సమాచారం ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలు డీఎంకే పాలనలో డిజిటల్‌ చెదపురుగుల బారిన పడ్డాయని, ఈ మోసానికి గానూ డీఎంకే విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో చట్టపరంగా ఎలాంటి విచారణౖనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈపుస్తకాల కొనుగోలుపై సమగ్ర విచారణ అవశ్యమని ప్రధానప్రతి పక్ష నేత, డీఎంకే యువజన నేత ఉదయ నిది స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement