సాక్షి, చైన్నె : తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.వి. అర్లేకర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌లతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గత 6 నెలలుగా తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌గా (కేరళ గవర్నర్‌తో పాటు) వ్యవహరించిన ఆర్.వి. అర్లేకర్, అక్టోబర్ 13న తమిళనాడు పూర్తిస్థాయి గవర్నర్‌గా నియమితులయ్యారు. అక్టోబర్ 16న బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం విజయ్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయన పలువురు ప్రముఖులను కలిశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న గవర్నర్ అర్లేకర్ తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లతోభేటీఅ య్యారు. ఆ మరుసటి రోజున ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను వేర్వేరుగా కలుసుకున్నారు. ప్రధాని మోదీతో జరిగిన భేటీలో తమిళనాడు సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతిపై సుదీర్ఘంగా చర్చించినట్లు రాజ్‌భవన్ ఎక్స్ పేజీలో వివరించారు. తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి గవర్నర్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపినట్టు పేర్కొన్నారు.


