సాక్షి, చైన్నె : రైల్వే ప్రయాణికులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన తాగునీటిని అందించేందుకు దక్షిణ రైల్వే చైన్నె డివిజన్ సిద్ధమైంది. ఇందులో భాగంగా చైన్నె సెంట్రల్, ఎగ్మోర్, తాంబరం, పెరంబూర్‌తో సహా డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లలో రోజూ తాగునీటి నాణ్యతను పరీక్షించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, ఉద్యోగుల నివాస ప్రాంతాలు, కార్యాలయాల్లో తాగునీటి నాణ్యతను పరిశీలించే ప్రక్రియను ముమ్మరం చేశారు. నీటి వనరుల దగ్గర, పంపిణీ కేంద్రాల వద్ద నమూనాలను సేకరించి బ్యాక్టీరి యా, రసాయన విశ్లేషణలు నిర్వహిస్తున్నారు. నీటిలో ని క్రియాశీల క్లోరిన్ స్థాయిలను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, ఎక్కడైనా తేడాలు గమనిస్తే వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. నీటి నిల్వ ట్యాంకులు, వాటర్ కూ లర్లు, పైప్‌లైన్లు, పంపిణీ కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్రిమిరహితంగా చర్యలు చేపట్టారు.తాజాగా చైన్నె సెంట్రల్, ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేటై, పెరంబూర్, ఆవడి, తిరువళ్లూరు, వేలచ్చేరి స్టేషన్లతో పాటు ఆయా ప్రాంతాల్లోని రైల్వే కాలనీల్లో ఈ విస్తృత పరిశీలనపై దృష్టి కేంద్రీకరించారు. ప్రయాణికుల సంక్షేమం, ఆరోగ్య రక్షణే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
డ్రోన్ ప్రత్యేకతలు
ఒక్కో డ్రోన్ రైల్వే స్టేషన్ కేంద్రంగా సుమారు రెండు కిలోమీటర్ల పరిధి వరకు ఆకాశ మార్గం ద్వారా నిరంతరం నిఘా ఉంచుతుంది. రాబోయే దీపావళి పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ రైల్వే సుమారు 40 ప్రత్యేక రైళ్లు, 85కి పైగా సర్వీసులను నడపాలని ప్రణాళిక సిద్ధం చేసింది. చైన్నె నుంచి మదురై, తిరునెల్వేలి, నాగర్‌కోయిల్, కోయంబత్తూరు మార్గాల్లో నడిచే ఈ ప్రత్యేక రైళ్ల వివరాల తాజాగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణీకుల భద్రత లక్ష్యంగా డ్రోన్ల ను ఉపయోగించేందుకు సిద్ధం కావడం విశేషం.


