జెమ్‌ వీరమణి పోక్సో కేసులో కస్టడీకి నిందితులు | - | Sakshi
Sakshi News home page

జెమ్‌ వీరమణి పోక్సో కేసులో కస్టడీకి నిందితులు

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

● శాంతి, మహేంద్ర సింహన్‌ వద్ద 3 రోజుల విచారణ

సాక్షి, చైన్నె : సంచలనం సృష్టిస్తున్న జెమ్‌ వీరమణి పోక్సో కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులు శాంతి, మహేంద్ర సింహన్‌ను విచారించేందుకు మూడు రోజుల పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌కు చైన్నె పోక్సో ప్రత్యేక కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు.. మైనర్‌ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై గ్రానైట్‌ వ్యాపారి జెమ్‌ వీరమణి, అతని సహచరులు శాంతి, మహేంద్ర సింహన్‌, సహాయకుడు గణేషన్‌పై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు వీరమణి విచారణలో వెల్లడించిన కీలక సమాచా రం ఆధారంగా.. శాంతి, మహేంద్ర సింహన్‌లను కూడా విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ దారుణానికి సంబంధించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ రాకెట్‌ వెనుక ఎవరెవరున్నారు అనే కోణాలపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సాయంత్రం న్యాయమూర్తి పద్మ ఎదుట విచారణ కు రాగా, పోలీసుల విజ్ఞప్తికి అనుమతి ఇచ్చారు. దీంతో శాంతి, మహేంద్రల వద్ద విచారణ జరుగుతోంది. కాగా, ఈ కేసును గతంలో తుంగలో తొక్కే ప్రయత్నం చేశారంటూ పలువురు పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసి విచారించేందుకు క్రైం బ్రాంచ్‌ సిద్ధమైంది. ఇందులో ముగ్గురు కీలక పోలీసు అధికారులు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. వీరు గతంలో ఈకేసు విచారించిన వారిలో ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ లైంగిక దాడి గురించి గతంలోనేతాను వెలుగులోకి తెచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదంటూ రంజన్‌కుమార్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలలో తమిళగ మున్నేట్ర కళగం నేత జాన్‌ పాండియన్‌ పేరు తెరపైకి రావడం చర్చకు దారి తీసింది. తనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు జాన్‌ పాండియన్‌ స్పందిస్తూ, ఈకేసుతో తనకు సంబంధం లేదని, అయితే, గతంలో రంజన్‌కుమార్‌ అనే వ్యక్తి శాంతి అనే మహిళకు న్యాయం చేకూర్చే విధంగా పారిశ్రామిక వేత్తను బెదిరించి రూ. 20 కోట్లు ఇప్పించాలని తన వద్దకు వచ్చాడని, అయితే, తానుఅ ందుకు అంగీకరించక లేదన్నారు. ఇక, మరో వైపు కస్టడీలో ఉన్న శాంతి, మహేంద్రలు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement