పొన్నేరి వైద్యశాలలో దారుణం | - | Sakshi
Sakshi News home page

పొన్నేరి వైద్యశాలలో దారుణం

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

● కంప్యూటర్‌ ఆపరేటర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పటించిన యువకుడు ● బాధితురాలి పరిస్థితి విషమం

తిరువళ్లూరు: పొన్నేరి ప్రభుత్వ వైద్యశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై వైద్యశాల ఆవరణలోనే పెట్రోల్‌ పోసి నిప్పటించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా ప్రభుత్వ వైద్యశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా రాజేశ్వరి(36) అవుట్‌ సోర్సింగ్‌గా పని చేస్తున్నారు. ఈమె సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తి రాజేశ్వరిపై పెట్రోల్‌ పోశాడు. దీంతో యువతి భయంగా పరుగులు పెట్టగా వెంటనే ఆమైపె నిప్పును విసరడంతో మంటల్లో చిక్కుకుంది. భయంతో వైద్యశాలలోకి పరుగులు పెట్టిన మహిళను వైద్యశాల సిబ్బంది రక్షించి ప్రాధమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన చికిత్స కోసం చైన్నె కీళ్‌పాక్కం వైద్యశాలకు తరలించి అక్కడ వైద్యసేవలను అందిస్తున్నారు. కాగా మహిళకు నిప్పు పెట్టిన వ్యక్తి అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితుడ్ని గుర్తించి రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన గాలింపు చర్యలనుచేపట్టారు. నిందితుడు ప్రకాష్‌ మాధవరం సమీపంలోని శ్మశాన వాటిక వద్ద వున్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో అతడు ఎదురుదాడికి దిగాడు. ప్రకాష్‌ను పట్టుకోవడానికి యత్నించిన తమిళ్‌సెల్వవన్‌ను కత్తితో దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. వెంటనే ఇన్పెక్టర్‌ శివకుమార్‌ నిందితుడిపై కాల్పులు జరిపి అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడ్ని చికిత్స కోసం చైన్నె స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనవ స్తానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా సంఘటన స్థలాన్ని కలెక్టర్‌ కవిత పరిశీలించారు. బాధితురాలు రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని, వెంటిలేటర్స్‌ అవసరం లేకుండానే ఆమె స్పందిస్తున్నారని కలెక్టర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement