టోరంటో చిత్రోత్సవాల్లో డోరతి | - | Sakshi
Sakshi News home page

టోరంటో చిత్రోత్సవాల్లో డోరతి

Sep 13 2026 7:40 AM | Updated on Sep 13 2026 7:40 AM

తమిళసినిమా: దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం డోరత్‌ ఇది ఈయన దర్శకత్వం వహించిన 10వ చిత్రం అన్నది గమనార్హం. నటి కీర్తీ సురేష్‌ టైటిల్‌ పాత్రను పోషించిన ఇందులో నటుడు సనత్‌, రిషీకాంత్‌ కథానాయకులుగా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆయనకు 1540 వ చిత్రం అన్నది గమనార్హం.జియో స్టూడియోస్‌ సంస్థ మర్పణలో సిఖియా ఎంటర్‌టైన్మెంట్‌, ధమ్మన్‌ ఫిలింస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ ను ,ప్రోమోను ఇటీవల విడుదల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం టోరంటో లోని స్కాటియబ్యాంక్‌ థియేటర్లో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో శుక్రవారం ప్రదర్శింపబడింది. అనంతరం అందులో పాల్గొన్న ప్రపంచ సినీ ప్రముఖులు ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఈ చిత్రోత్సవంలో డోరతి చిత్ర కథానాయికి కీర్తీ సురేష్‌, దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌, నటులు సనత్‌, రిషీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఇది మదురై నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథా చిత్రం అని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఇంతకు ముందే తెలిపారు. అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపిక అయినా, ఇది చక్కని ప్రేమ, స్నేహం వంటి అంశాలతో రూపొందించిన కమర్షియల్‌ కథా చిత్రం అని ఆయన పేర్కొన్నారు.కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డోరతి చిత్రాన్ని ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని పక్కా బలం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement