టీవీకే కార్యకర్తలను అదుపులో పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

టీవీకే కార్యకర్తలను అదుపులో పెట్టాలి

Sep 8 2026 1:35 AM | Updated on Sep 8 2026 1:35 AM

సాక్షి, చైన్నె : సమాజంలో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని డీఎండీకే ప్రధానకార్యదర్శి,ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్‌ వ్యాఖ్యానించారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో మహిళలను వికృతంగా, అత్యంత ఘోరంగా దూషించే తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా సీఎం విజయ్‌ అదుపులో పెట్టాలని, మందలించాలని సూచించారు. మంత్రి నిర్మల్‌ కుమార్‌ సమాధానం ఇస్తూ తమ పార్టీ పేరుతో కొందరు నకిలీ ఐడీలు సృష్టించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో డీఎంకే నాయకులు కెప్టెన్‌ విజయకాంత్‌కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించారో, ఇప్పుడు తమకూ అదే చేస్తున్నారు. టీవీకే లో ఎవరు తప్పుగా మాట్లాడినా వారిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు. కాగా అసెంబ్లీలో టీవీకే మహిళా ఎ మ్మెల్యేలు అందరూ ఒకే రకమైన డ్రెస్‌ కోడ్‌ చీర ధరించి రావడం ఆకర్షణకు దారి తీసింది. ఆపార్టీ ఎమ్మెల్యే పల్లవి తన చంటి బిడ్డతో సభకు వచ్చారు.అదే సమయంలో వారు ధరించి చీర రంగునే డీఎండీకే ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్‌ ధరించడం రావడంతో కొత్తచర్చ బయలు దేరింది. ఇందుకు ఆమె వివరణ ఇస్తూ, వారి డ్రెస్‌ కోడ్‌గురించి తనకు తెలియదని, అయితే, తాను సాధరణంగానే రంగు ఈ చీర ధరించి వచ్చినట్టు పేర్కొన్నారు.

ప్రతి బాటిల్‌పై

రూ. 10 తగ్గింపు..

– టాస్మాక్‌ దుకాణాల వద్ద రద్దీ

కొరుక్కుపేట: గత వారం నుండి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న టాస్మాక్‌ దుకాణాలు ప్రతి బాటిల్‌పై అదనంగా రూ. 10 వసూలు చేయకుండా పరిమితం చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వును ఉల్లంఘించి మద్యం ప్రియుల నుండి రూ. 10 వసూలు చేసినందుకు కొందరిని తాత్కాలికంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ప్రభుత్వ చర్యతో ప్రజల్లో మద్యం ఆదరణ పెరగడంతో, టాస్మాక్‌ దుకాణాల వద్ద రద్దీ కూడా పెరిగింది. రాత్రి 8 గంటలకు జనం అదుపు తప్పుతున్నారు. రాత్రి 10 గంటలకు కూడా జనం గుమిగూడటంతో దుకాణాలను మూయలేని పరిస్థితి ఏర్పడి సమస్య తలెత్తుతోంది. అందువల్ల, పోలీసు భద్రతతో మాత్రమే దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైన్నెలోని టాస్మాక్‌ దుకాణాలలో సాయంత్రం 6 గంటల తర్వాత రద్దీ పెరుగుతుంది. ఈనేపథ్యంలో చాలా దుకాణాలకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు. రద్దీని నివారించడానికి మద్యం దుకాణాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం కొనుగోలు చేయడానికి వినియోగదారులు వరుసలో నిలబడి, సరిగ్గా చిల్లర చెల్లించాలని కోరుతూ ఒక నోటీసు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. తాజాగా టాస్మాక్‌ ఉద్యోగులు గరిష్ట ధర కంటే ఎక్కువ వసూలు చేయడం కొనసాగిస్తే, వారిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తామని, అదే తప్పును రెండోసారి చేస్తే శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.

రేపు తిరుక్కుడై

ఉత్సవ ఊరేగింపు

కొరుక్కుపేట: తిరుపతి గొడుగుల సేవా సమితి ట్రస్ట్‌ తరపున తిరుపతి గొడుగుల ఉత్సవ ఊరేగింపు ఈ నెల 9వ తేదీ బుధవారం జరగనుందని ఆ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ జి. రామలింగం మీడియాకు తెలిపారు. తిరుమల తిరుపతిలో వార్షిక పురటాసి బ్రహ్మోత్సవం సందర్భంగా తిరుక్కుడై సేవా సమితి ట్రస్ట్‌ తరపున తిరుమల దేవస్థానానికి ట్రస్టీ ఎస్‌.శ్రీనివాసన్‌ నేతృత్వంలోని సమితి ట్రస్ట్‌ ట్రస్టీ ఎ. తణిగైవేల్‌ అందమైన తెల్లని పట్టు గొడుగులను బహూకరించారు. ఈ విషయంలో, ఈ సంవత్సరం 9వ తేదీ బుధవారం ఉదయం 10.31 గంటలకు చైన్నె ప్యారీస్‌ ప్లవర్‌ బజార్‌ లోనిచెన్న కేశవ పెరుమాళ్‌ ఆలయం నుండి తిరుపతి గొడుగులు ఊరేగింపు ప్రారంభమవుతుంది, అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఎగ్మోర్‌ ప్రాంగణంలో జస్టిస్‌ టి. రాకేష్‌ రాజ్‌ , డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ జి.కె. కన్నన్‌ ఊరేగింపును జెండా ఊపి ప్రారంభిస్తారు. ప్రత్యేక అతిథులు హాజరవుతారు. 21 తెల్లటి పట్టు గొడుగులు ఎన్‌.ఎస్‌.సి. బోస్‌ రోడ్‌, వాల్టెక్స్‌ రోడ్‌, చుళై హైవే, ఎ.పి. రోడ్‌ మీదుగా సాగుతాయన్నారు. ఆదివారం, 13వ తేదీన ఉదయం 10 గంటలకు, తమిళనాడు ప్రజలు ప్రార్థనలతో ఊరేగింపుగా తీసుకువెళ్లిన గొడుగులను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ పద్మావతి తాయార్‌ ఆలయానికి, సాయంత్రం 4 గంటలకు తిరుమలలోని దేవస్థానం అధికారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement