– ఒకరికి కై ండ్ జీవిత సాఫల్య
పురస్కారం ప్రదానం
సాక్షి, చైన్నె: చైన్నె వేప్పేరనిలో కై ండ్ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల పాఠశాలలకు చెందిన 140 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మొత్తం 400 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకలో తరలి వచ్చారు. లంక డిప్యూటీ హైకమిషనర్ గణేశానందన్ గీతీశ్వరన్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న కై ండ్ సంస్థ సేవలను ఆయన కొనియాడారు.
జీవిత సాఫల్య పురస్కారం
గత 5 దశాబ్దాలుగా ఉచిత వైద్యసేవలు అందిస్తూ లక్షలాది మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేసిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, అమృత్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సోహన్ లాల్ జీకి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు ఈ సందర్భంగా ప్రదానం చేశారు. ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల కోంస ఉచితంగా వైద్య సలహాలు, మందులు ఫిజియోథెరపీ సౌకర్యాలతో త్వరలోనే ప్రత్యేక క్లినిక్‌ను ప్రారంభించనున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అన్నా విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ అరివుడైనంబి, ప్రొఫెసర్ ఆర్.ఎల్. గోధారా, డాక్టర్ అరుణ్ పిచ్చై నారాయణన్, సభాధ్యక్షత వహించిన సుభాష్ రంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


