వారిపై అవినీతి కేసుల విచారణ కష్టం | - | Sakshi
Sakshi News home page

వారిపై అవినీతి కేసుల విచారణ కష్టం

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

● ట్రాక్‌ల సంఖ్య 10 నుండి 15కి పెంపు ● రూ. 19 కోట్లు కేటాయింపు

– జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ వెంకటేష్‌

సాక్షి, చైన్నె: మనలో ప్రాభవం, అధికారం కలిగిన వ్యక్తులపై అవినీతి కేసులను విచారించడం చాలా కష్టమైన పనిగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ వెంకటేష్‌ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్‌.పి. వేలుమణికి సంబంధించిన టెండర్ల అక్రమాల కేసులో, మాజీ కార్పొరేషన్‌ కమిషనర్లు కందసామి (చైన్నె), విజయకార్తికేయన్‌ (కోయంబత్తూర్‌) అనే ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై కేసు విచారణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యంపై జరిగిన విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలను ఆయన చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తూ.. తమిళనాడు ప్రభుత్వం పంపిన అనుమతి లేఖ జూలై 28న మాత్రమే అందిందని, అది ప్రస్తుతం పరిశీలనలో ఉందని తెలిపారు. దీనికి ప్రతిగా ఆగస్టు 27న రిమైండర్‌ లేఖ కూడా పంపామని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు

అవినీతి కేసులో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులపై విచారణకు అనుమతి ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేష్‌ అసంతృప్తిని వ్యక్తంచేశారు. విచారణకే ఇన్ని అడ్డంకులు ఎదురైతే, ఇక ఆ తర్వాత కేసులో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. అనుమతి ఇవ్వడంలో ఆలస్యానికి గల కారణాలు, ఆ లేఖ ప్రస్తుత పరిస్థితిపై వివరణ ఇవ్వాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అండర్‌ సెక్రటరీని ఆదేశించారు. తదుపరి విచారణలో వారు వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా హాజరుకావాలని స్పష్టం చేస్తూ, విచారణను ఈనెల 16కి వాయిదా వేశారు.

తాంబరం రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో మూడవ రైల్వే టెర్మినల్‌గా సేవలు అందిస్తున్న తాంబరం రైల్వే స్టేషన్‌ నుంచి మరిన్ని సుదూర ప్రాంతాల రైళ్లను నడిపేందుకు వీలుగా రూ. 19 కోట్ల అంచనా వ్యయంతో భారీ అభివృద్ధి పనులను దక్షిణ రైల్వే చేపట్టింది.తాంబరం స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ల సంఖ్యను 10 నుండి 15కి పెంచనున్నారు. చైన్నె సెంట్రల్‌ , ఎగ్మూర్‌ రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం మూడో టెర్మినల్‌గా రూపదిద్దుకున్న విషయం తెలిసిందే.ఎగ్మూర్‌లో రద్దీని మరింతగా తగ్గించే దిశగా తాంబరంను మరింత అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఆ దిశగా ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతూ కొత్త ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 9 లిఫ్టులు , 10 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యున్నత స్థాయి టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ఆధునిక సౌకర్యాలతో వేచి ఉండే గదులను నిర్మిస్తున్నారు. ఏటా దాదాపు 3.5 కోట్ల మంది ప్రయాణికులు ఉపయోగించుకునే తాంబరం స్టేషన్‌, ఈ విస్తరణ పనుల అనంతరం దక్షిణ జిల్లాలు , ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు ప్రత్యామ్నాయంగా ప్రధాన రవాణా కేంద్రంగా మారనున్నది.

శివాలయాల్లో ప్రదోష పూజలు

వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో ప్రధోష దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ప్రదోష పూజలు నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలచే మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయ కూరలు, పుష్పాలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోం హర నామ స్మరణాల మద్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామి వార్లును అధికార నంది వాహనంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాలాల నడుమ ఊరేగించారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement