సాక్షి, చైన్నె: చైన్నెలోని సెయింట్ జార్జ్ కోటలోని శాసనసభ, సచివాలయ ప్రాంగణాల్లో తగినంత స్థలం లేకపోవడంతో సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కొత్త శాసనసభ, సచివాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు పట్టినంబాక్కంలో స్థలాన్ని ఎంపిక చేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలోని ఈ స్థలంలో 15 అంతస్తులతో బ్రహ్మాండ భవనం నిర్మాణానికి కసరత్తులు జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ పరిసరాలలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు తాజాగా కార్యాచరణ సిద్ధం చేశారు. పట్టినంబాక్కం సమీపంలోని లైట్ హౌస్ నుండి అడయార్ వరకు 3.5 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.
బ్రహ్మాండ వంతెన మార్గం..
రూ. 1,200 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయ, శాసనసభ నిర్మాణాన్ని చేపట్టనునున్ననేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ మార్గంలో భారీ బ్రహ్మాండ వంతెన నిర్మాణానికి సిద్ధమయ్యారు. శాంతోమ్, అడయార్‌మార్గాలలో నిత్యం నెలకొనే ట్రాఫిక్ రద్దీని పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారు సచివాలయంలో 6 వేల పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజల రాకపోకలతో పట్టినాపాక్కం పరిసర ప్రాంతాల్లో వాహన రద్దీ విపరీతంగా పెరుగుతుందని గుర్తించారు. ఈ రద్దీని నివారించడానికి లైట్‌హౌస్ నుండి అడయార్ వరకు 3.5 కిలోమీటర్ల మేర హైస్పీడ్ ఫ్లైఓవర్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను జాతీయ రహదారుల శాఖకు అప్పగించారు.
మెరీనా లైట్ హౌస్ మార్గం


