శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

● వైభవంగా సాగుతున్న పవిత్రోత్సవాలు

కొరుక్కుపేట: చైన్నె టి.నగర్‌ వెంకట నారాయణ రోడ్డులో వెలసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈనెల 6న అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో రోజూ యాగ పూజలు, హోమాలు, స్నపన తిరుమంజనం కార్యక్రమాలు వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా సాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాల పూజలు, హోమం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా చేపట్టారు . అనంతరం పవిత్రాల సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో ఆలయ ఏఈవో ధనుంజయ్‌ తోపాటు టీటీడీ స్థానిక సలహామండలి మాజీ సభ్యులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement