తమిళసినిమా : ప్రముఖ నటుడు రామరాజన్, సంగీతజ్ఞాని ఇళయరాజాలది సూపర్‌హిట్ కాంబినేషన్ అన్నది తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా వీరి చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ వాడ వాడలా మారుంమోగుతున్నాయి. కాగా తాజాగా వీరి కాంబోలో 25వ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి కడవుల్ తంద పరిసు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి కాశీమాయన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కామెడి ట్రాక్‌ను రాజగోపాల్ రాస్తున్నారు. అదేవిధంగా సంభాషణలను రాజగోపాల్, అడైక్కలన్ కలిసి సంభాషణలను రాస్తున్నారు. ఇందులో చాలా కాలం తరువాత ప్రముఖ హాస్య జంట సెంథిల్, కోవై సరళ కలిసి నటించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆ చిత్రంపై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకుంటోందని చెప్పవచ్చు. అదేవిధంగా నటుడు రామరాజన్, సంగీతదర్శకుడు ఇళయరాజా కాంబోలో మళ్లీ చిత్రం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.
నటుడు రామరాజన్,
సంగీత దర్శకుడు ఇళయరాజా
సినిమాలతో పాటూ..
తమిళసినిమా: సినిమా చాలా పవర్‌ఫుల్ అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు చాలా మంది కళాకారులు ఇతర రంగాల్లో తమ ప్రతిభను రుజువు చేసుకుంటున్నారు. అలా స్టాండప్ కమెడియన్‌గా తన ప్రతిభను చాటు కున్న విక్కల్ విక్రమ్ తద్వారా సిని రంగప్రవేశం చేశారు. ఈయన కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం లైట్ వెయిట్ బేబీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ చిత్ర రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న విక్కల్ విక్రమ్ మరోవైపు తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన స్టాండప్ కామెడి షోలను కంటిన్యూ చేస్తున్నారు. దీని గురించి ఆయన మీడియాతో తెలుపుతూ తన జీవితంలో జరిగిన పలు అంశాలను తీసుకుని స్టాండప్ షో వేదికలపై ప్రేక్షకులను సంతోషపరచే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. తన బాల్యం, విద్య, పెళ్లి, అనుబంధాలు వంటి సంఘటలను స్టాండప్ షోలలో ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణను పొందుతూ వస్తున్నట్లు చెప్పారు. కొన్ని విషయాలను చెప్పడంలో సంకట పరిస్థితి ఏర్పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. కాగా తన మొదటి, తనకు చాలా ప్రత్యేకమైన స్టాండప్ షో ఇప్పుడు యూట్యూట్ ఛానల్‌లో ప్రసారం అవుతోందని, కాగా తాజాగా మరో షోను ఈ నెల 27న చైన్నె లోని మ్యూజిక్ అకాడమీ ఆవరణలో నిర్వహించనున్నట్లు చె ప్పారు. అదేవిధంగా తన స్టాడ ప్ షోలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు నటుడు విక్కల్ విక్రమ్ తెలిపారు.


