పోలీసుల దినోత్సవం ప్రతిజ్ఞ
తిరుత్తణి: సెప్టెంబర్ 6 పోలీసుల దినోత్సవం సందర్భంగా తిరుత్తణిలో ఆదివారం పోలీసు లు ప్రతిజ్ఞ చేపట్టారు. గత ఏడాది నుంచి సె ప్టెంబర్ 6న పోలీసుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రెండవ ఏడాదిగా ఆదివారం పోలీసుల దినోత్సవం నిర్వహించారు. తిరుత్తణి సబ్ డివిజన్‌లోని తిరుత్తణి, తిరువలంగాడు, కనకమ్మసత్రం, పళ్లిపట్టు, ఆర్కేపేట, పోదటూరుపేట పోలీస్ స్టేషన్‌ల నుంచి పోలీసులు పాల్గొని డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభు త్వ బాలుర మహాన్నత పాఠశాల వేదికగా విధు లను సక్రంగా నిర్వహిస్తామని, చేపట్టిన బాధ్యతల్లో ఎలాంటి ప్రేమనురాగాలు, ద్వేషాలకు తావు లేని విధంగా న్యాయం చేకూరుస్తానని, క్రమం తప్పకుండా తన బాధ్యతలు పాటించి విదులు చేపడుతానని పోలీసులు ప్రతిజ్ఞ చేశా రు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఏఎస్పీ శుభమ్‌దిమాన్ ప్రారంభించారు.
వేలూరులో ఘనంగా
పోలీస్ దినోత్సవం
వేలూరు: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల జ్ఞాపకార్థంగా పోలీస్ దినోత్సవాన్ని ఎస్పీ శివరామన్ అధ్యక్షత వేలూరు నేతాజీ మైదానంలో పోలీసు అధికారులతో కలిసి నిర్వహించారు. అదే విధంగా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలకు చెందిన పోలీసులు, హోంగార్డులు వారి కుటుంబ సమేతంగా కలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు క్రీడా పోటీలు, రక్తదానం శిబిరం నిర్వహించి వాటిని ఎస్పీ పరిశీలించారు. ఇదిలా ఉండగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు ఎస్పీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన పోలీసులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహాబలిపురంలో అగ్నిమాపక విభాగానికి సొంత భవనం
– సీఎం విజయ్ ప్రకటనతోస్థానికుల సంతోషం
కొరుక్కుపేట: అగ్నిమాపక, రక్షణ సేవల శాఖ నిధుల మంజూరు అభ్యర్థనకు సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు అసెంబ్లీలో 23 నోటిఫికేషన్లను జారీ చేశారు. దీనిలో భాగంగా, అగ్నిమాపక రక్షణ సేవల విభాగం ఉప యోగం కోసం 15 కొత్త ప్రదేశాలలో అగ్నిమాపక, రక్షణ సేవల కేంద్రాల కోసం కొత్త భవ నాల నిర్మాణానికి రూ. 65.90 కోట్లు ఖర్చు చేయనున్నారు. చారిత్రక పర్యాటక ప్రదేశమైన మహాబలిపురం వాటిలో ఒకటి. మహాబలిపురం అగ్నిమాపక రక్షణ సేవల కేంద్రం 2020లో ప్రారంభించారు. ప్రారంభంలో ఈ స్టేషన్ కోవలం రోడ్డులోని మహాబలిపురం స్టేషన్ సమీపంలో ఉన్న ఒక పోలీస్ స్టేషనన్‌లోని ప్రైవేట్ ప్రదేశంలో తాత్కాలికంగా ఉండేది. ఆ తర్వాత ఏప్రిల్ 2022లో, ఇది నగరం నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంపురుషం ప్రాంతంలోని ఒక మున్సిపల్ కమ్యూనిటీ హాల్‌లో పనిచేసింది. తమ సొంత రక్షణ పరికరాలను సురక్షితంగా నిల్వ చేసుకోలేకపోయినప్పటికీ, అగ్నిమాపక శాఖ అధికారులు ఒక భవనం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితిలో.. ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
కంచి దక్షిణ జిల్లా డీఎంకే కార్యవర్గ సమావేశం
– కొత్తవారికి పదవులు
కొరుక్కుపేట: కాంచీపురం దక్షిణ జిల్లాలోని మధురాంతకం, సెయ్యూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన డీఎంకే కార్యవర్గ అత్యవసర కార్యవర్గ సమావేశం మధురాంతకం సమీపంలోని మేలవాలంపేటలోని ముకుందన్ మహల్‌లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఎస్. ఇనియరసు అధ్యక్షత వహించారు. పార్టీ ప్రతినిధులు , ఎంపీ సి.ఎన్. అన్నదురై , కె.వి. లెనిన్ హాజరయ్యారు. కాంచీపురం దక్షిణ జిల్లా కార్యదర్శి కె. సుందర్ సభకు స్వాగతం పలికి ప్రసంగించారు.ఆ సమయంలో మాట్లాడుతూ, కాంచీపురం దక్షిణ జిల్లా బ్రాంచ్ సెక్రటరీ పదవికి 45 సంవత్సరాలు, పేరూర్ సెక్రటరీ పదవికి 60 సంవత్సరాలు, నగర సెక్రటరీ పదవికి 50 సంవత్సరాలు , జిల్లా సెక్రటరీ పదవికి 70 సంవత్సరాలుగా వయోపరిమితిని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ప్రకటించారని కె. సుందర్ తెలిపారు.


