తమిళసినిమా: నటి ప్రియాంక మోహన్ మళ్లీ బిజీ అవుతున్నారు. బహుభాషా కథానాయకిగా పేరు తెచ్చుకున్న కన్నడ నటి ఈమె. తమిళంలోకి శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత మరోసారి శివకార్తీకేయన్ సరసన డాన్ చిత్రంలోనే, ఆ తరువాత సూర్యకు జంటగా ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్‌తో కెప్పెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఈమె ఇటీవల నటించిన మేడ్ ఇన్ కొరియా చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతే కాదు ఆ తరువాత ప్రియాంక మోహన్‌ను దక్షిణ కొరి యా దేశం పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం విశేషం. కాగా ప్రస్తుతం మారిసెల్వరాజ్ దర్శకత్వంలో మంజణత్తి అనే చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. అదేవిధంగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న అరసన్ చిత్రంలో శింబుకు జంటగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాత ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ అధినేతలు కల్పాత్తి అఘోరం, కల్పాత్తి ఎస్.సురేశ్, కల్పాత్తి ఎస్.గణేశ్ నిర్మిస్తున్న నూతన చిత్రంలో ప్రియాంక మోహన్ నాయకిగా నటిస్తు న్నారు. ఇందులో నటు డు జై కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇది ఏజీ ఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న 29 వ చిత్రం కావడం గమనార్హం. ఈ సంస్థ చివరిగా నిర్మించిన చిత్రం బ్లాస్ట్. ఇది కమర్షియ ల్‌గా మంచి విజయా న్ని సాధించింది. కాగా ఇంకా పేరు నిర్ణయించని తాజా చిత్రానికి ఎంఎస్.ఆనందన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటుడు యోగిబాబు, నాజర్, రాజీవ్ మీనన్, జీఎం.సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటి ప్రియాంక మోహన్ షాడో ఫొటో చుట్టూ రక్తం, తుపాకీ, ఆయుధాలు, టైప్‌రైటర్ మిషన్‌ను పొందుపరిచారు. దీంతో ఇది క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.
నటుడు విక్కల్ విక్రమ్


