ఇతర భాషల్లోనూ.. మొద రాతిరి చిత్రాన్ని.. | - | Sakshi
Sakshi News home page

ఇతర భాషల్లోనూ.. మొద రాతిరి చిత్రాన్ని..

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

తమిళసినిమా: ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు కోలీవడ్‌లోనూ విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు అజిత్‌ హీరోగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ , ప్రదీప్‌ రంగనాథ్‌ హీరోగా డ్యూడ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ అధినేతలు యేర్నేని నవీన్‌, వై.రవిశంకర్‌ ఇటీవల నిర్మించిన చిత్రం మొద రాతిరి. నటుడు రిషికాంత్‌,అనిష్మా అనిల్‌కుమార్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాజా కరుప్పుసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. భరత్‌శంకర్‌ సంగీతాన్ని, దినేశ్‌ కరుప్పుసామి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం గత ఆగస్ట్‌ నెల 21వ తేదీన విడుదలై ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్భింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం థాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజా కరుప్పుసామి మాట్లాడుతూ తన కథను నమ్మి అవకాశాన్ని కల్పించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలకు ధన్యవాదాలు అన్నారు. నటుడు రిషీకాంత్‌ మాట్లాడుతూ మీ ఇంటి అబ్బాయిగా భావించి తాను నటించిన ఈ చిత్రాన్ని ఆదరించిన మీడియాకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రాన్ని తాను,దర్శకుడు రాజా కరుప్పుసామి మో శామన్నారు. చిత్రనిర్మాతలలో ఒకరైన నవీన్‌ యేర్నేని మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నిర్మించడంలో తాము చాలా హ్యాపీ అని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నా రని అన్నారు. దర్శకుడు రాజా కరుప్పుసామి, హీరో రిషికాంత్‌ తదితర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అన్నారు. దర్శకుడు ఈ కథ చెప్ప గానే నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement