‘మానవ వనరుల నిర్వహణ’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘మానవ వనరుల నిర్వహణ’ పుస్తకావిష్కరణ

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

సాక్షి, చైన్నె : చైన్నె: ప్రముఖ రచయిత బాలాజీ శేషాద్రి రాసిన మైండ్‌ఫుల్‌ మండేస్‌ (ఆంగ్లం), తింగళుమ్‌ తెలివుమ్‌ (తమిళం) పుస్తకాలను తమిళనాడు ఆహార, పౌర సరఫరాల శాఖ గౌరవ మంత్రి పి. వెంకటరమణన్‌ చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాల తొలి ప్రతులను జి.ఆర్‌.టి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.ఆర్‌. రాధాకృష్ణన్‌, ఏ2బీ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే.టి. శ్రీనివాస రాజా, సత్య ఏజెన్సీస్‌ సి.ఎమ్‌.డి జాన్సన్‌ ఆసరియా, టెక్నో ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి శ్రీనివాసన్‌, గురు – జానా భాగస్వామి గురు ప్రసాద్‌ మకమ్‌, చైన్నెస్‌ అమృత గ్రూప్‌ ఛైర్మన్‌ ఆర్‌. భూమినాథన్‌, ఎ.ఆర్‌. శేషాద్రి వంటి పారిశ్రామికవేత్తలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరమణన్‌ మాట్లాడుతూ.. వ్యవస్థాప క విజయం, స్థిరమైన కార్పొరేట్‌ వృద్ధికి ప్రభావవంతమైన మానవ వనరుల నిర్వహణ అత్యంత కీలకమన్నా రు. యువ నిపుణులు, వ్యాపార నాయకులు , సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థలను నిర్మించాలనుకు నే సంస్థలకు అనువైన, ఆచరణాత్మక పరిష్కారాలను అందించినందుకు బాలాజీ శేషాద్రిని ఆయన అభినందించారు. ’బిలీఫ్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ బిలీఫ్‌ ఆఫీసర్‌ బాలాజీ శేషాద్రి ఈ పుస్తకాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని వివరించారన్నారు. పని ప్రదేశాల్లో యాజమాన్యం–ఉద్యోగుల సంబంధాలను పెంపొందించడం, జవాబుదారీతనం, కార్యాచరణ నైపుణ్యం, బాధ్యతల వికేంద్రీకరణ, విలువ ఆధారిత అభివృద్ధి వంటి కీలక అంశాలను ఈ పుస్తకాలు చర్చిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో పారిశ్రామిక, తయారీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి ప్రజలలో ఉన్న బలమైన పారిశ్రామిక స్ఫూర్తియే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్‌ దిగ్గజాలు, వ్యాపార నాయకులతో శ్రీ శేషాద్రి జరిపిన వ్యూహాత్మక చర్చల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ రెండు పుస్తకాలు... స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార యజమానులు తమ సంస్థాగత సవాళ్లను అధిగమించి స్థిరమైన వృద్ధిని సాధించడానికి ఒక మార్గదర్శిగా ఉపయోగపడతాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement