వేలూరు: విద్యార్థులు తమిళ భాషకు అధిక ప్రాధ్యా న్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్శిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు కంభన్ కయగం ఆధ్వర్యంలో 48వ వార్షికోత్సవం, కుప్పుస్వామి మొద లియార్ శత జయంతి వేడుకలు వేలూరు వీఐటీ యూ నివర్సిటీ ఉపాధ్యక్షులు, కంబన్ కళగం అధ్యక్షులు జీవీ సెల్వం అద్యక్షతన వేలూరులోని టౌన్ హాలులో జరి గింది. ఈ కార్యక్రమానికి వీఐటీ చాన్స్‌లర్ ముఖ్య అతిథిగా హాజరై తమిళ కవులు, మేధావుల చిత్ర పటా లను అవిష్కరించడంతో పాటూ తమిళ భాషా కవులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కంబన్ కళగం వార్షికోత్సవం, కుప్పుస్వామి మొదలి యార్ జయంతి వేడుకలు ఒకే రోజు కలిసి రావడం అభినందనీయమన్నారు. ప్రపంచంలో అనేక సాహి త్య రచనలు ఉన్నప్పటికీ వాటిలో కంబ రామాయణం అత్యుత్తమ మైనదిగా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమిళులు లేదా భారతీయుల అభిప్రాయం మాత్రమే కాదు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఫ్రొఫెసర్ జార్జ్ ఎల్ హార్ట్ కంబ రామాయణాన్ని ఒక సాహిత్య కళా ఖండంగా అభివర్ణించారన్నారు. అదే విధంగా గ్రీకు కవి హోమర్ కూడా కంబ రామాయణాన్ని ఒక గోప్ప ఇతి హాసంగా గుర్తించారన్నారు. వేలూరు కంభన్ కయగం చైర్మన్, వీఐటీ ఉపాద్యక్షులు జీవీ సెల్వం అధ్యక్షత వహించి మాట్లాడుతూ కంబన్ సరస్వతీ దేవి కరుణా కటాక్షంతో రూపుదిద్దుకున్నాడు. అనంతరం కంబన్ కళగం ఆధ్వర్యంలో పలు సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో కంబన్ కయగం ప్రతినిధులు, మేధావులు, తమిళ రచయితల సంఘం ప్రతినిధులు, తమిళ భాషా పండితులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


