కల్లనై నుంచి కావేరి నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

కల్లనై నుంచి కావేరి నీటి విడుదల

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

● డెల్టా రైతుల హర్షాతిరేకాలు ● నీటి సరఫరాను ప్రారంభించిన మంత్రులు

సాక్షి, చైన్నె: డెల్టా జిల్లాలలోని రైతులకు ప్రధాన నీటి వనరుగా మేట్టూరు జలాశయం ఉన్న విషయం తెలిసిందే. కావేరి నదీపై నిర్మించిన ఈ డ్యాం నుంచి ప్రతి ఏటా జూన్‌ 12న డెల్టా సాగుకు నీటిని విడుదల చేస్తారు. అయితే, ఈ ఏడాది ఆశించిన మేరకు నీళ్లు లేక పోవడంతో గత వారం ఈ డ్యాం నుంచి సాగుకు నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ డ్యాం నీటి మట్టం 90 అడుగులకు చేరడంతో రైతుల విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్‌ 1న సీఎం సి. విజయ్‌ మేట్టూరుకు వెళ్లి మరీ నీటిని విడుదల చేశారు. మేట్టూరు నుండి విడుదలైన నీరు సుమారు 205 కిలోమీటర్లు ప్రయాణించి తంజావూరు జిల్లా సరిహద్దులోని కల్లనై ఆనకట్టకు శనివారం చేరుకుంది. దీంతో డెల్టాలో అత్యంత కీలకంగా ఉన్న తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం తదితర జిల్లాలకు నీటిని ఇక్కడి నుంచి కెనాల్స్‌ ద్వారా విడుదల చేయడానికి చర్యలు తీసుకున్నారు.

నీటి విడుదల

రాష్ట్ర వ్యవసాయ, ఉపాధి సంక్షేమ శాఖ మంత్రి ఆర్‌. వినోద్‌, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎ.ఎమ్‌. షాజహాన్‌, డెల్టా జిల్లాల కలెక్టర్లు , నీటిపారుదల శాఖ అధికారులు కల్లనై వద్ద ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు కావేరి, వెన్నారు, కల్లనై కాలువ, కొల్లిడం నదుల తూర్పు షట్టర్లను తెరిచి, నవధాన్యాలు, పూలు చల్లి సాగు కావేరి తల్లిని నమస్కరించి నీటి విడుదలను ప్రారంభించారు. తొలి విడతగా కావేరి, వెన్నారు నదులలో సెకనుకు 1,000 క్యూసెక్కుల చొప్పున, కల్ౖలనె కాలువ, కొల్లిడం నది ద్వారా 500 క్యూ సెక్కుటలమేరకు నీటిని రైతులకు విడుదల చశారు.రానున్న రోజులలో ఈ విడుదల శాతం పెంచేందుకు నిర్ణయించారు.ఈ నీటి విడుదల ద్వారా తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం తదితర డెల్టా జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో సంబా, తాళడి పంటల సాగుకు అవసరమైన నీరు అందుబాటులోకి వచ్చినట్టైంది. ఈ విషయంగా మం త్రులు మాట్లాడుతూ, రైతుల అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కూడదనిసీఎం విజయ్‌ ఆదేశించారన్నారు. రైతుల పంటలసాగుబడికి అవసరమైన మేరకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

కావేరి డెల్టా జిల్లాల్లో సంబా, తాళడి సాగు నీటి అవసరాల నిమిత్తం ఆదివారం ఉదయం చారిత్రాత్మక కల్లనై ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేశారు. ఈ నిర్ణయంతో డెల్టా జిల్లాల వ్యవసాయదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చైన్నెకు వీరాణం నీరు..

కడలూరు జిల్లాలోని వీరాణం రిజర్వాయర్‌ నుంచి చైన్నె తాగు నీటి అవసరాలకు సెకనుకు 56 క్యూబిక్‌ నీటిని విడుదల చేశారు. వీరాణం నీటి మట్టం ప్రస్తుతం 41 అడుగులుగా ఉంది. చైన్నెకు నీటి అవసరాల దృష్ట్యా ఇక్కడి నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. కల్లనై నుంచి 100 క్యూబిక్‌ మేరకు నీళ్లు కీలనైకు వస్తున్నది. ఇక్కడి నుంచి నీటిని వీరాణంకు మళ్లించడం జరుగుతున్నది. దీంతో వీరాణం నుంచి చైన్నెకు నీటి పంపిణి ప్రారంభించారు. ఇదిలా ఉండగా, నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ, వాతావరణ మార్పులతో రానున్న మూడు లేదా నాలుగు రోజుల పాటుగా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఎండ వేడి అధికంగానే, మరికొన్ని జిల్లాలోచెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నె, శివారులలో రాత్రులలో గత రెండు రోజులుగా వర్షం పడుతోంది. పశ్చిమ కనులమ వెంబడి జిల్లాలో 12వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటలలో మదురై మేలూరులో 12 సెం.మీ, తనియామంగళంలో 9 సెం.మీ, విరుదునగర్‌ సాత్తూరులో 8 సెం.మీ అరియలూరులో 7 సెం.మీ మేరకు వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement