సురక్షిత తమిళనాడు నిర్మిద్దాం! | - | Sakshi
Sakshi News home page

సురక్షిత తమిళనాడు నిర్మిద్దాం!

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

● పోలీసు దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్‌ ● మంత్రి రాజ్‌ మోహన్‌ ● నలుగురు జాలర్ల రక్షింపు

న్యూస్‌రీల్‌

● పోలీసు దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె : సమాజంలో శాంతిభద్రతలను కాపా డుతూ, చట్టాన్ని అమలు చేయడంలో నిరంతరం శ్ర మిస్తున్న పోలీసుల కోసం ‘సురక్షి, విశిష్టమైన తమిళనాడును నిర్మిద్దాం’ అని సీఎం విజయ్‌ పిలుపునిచ్చారు. పోలీసుల దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్‌ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

చారిత్రక నేపథ్యం: 1859లో మద్రాస్‌ డిస్ట్రిక్ట్‌ పోలీ స్‌ యాక్ట్‌ ద్వారా ఆధునిక పోలీస్‌ వ్యవస్థ ఏర్పడిన రోజును పురస్కరించుకుని ఈ పోలీసుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు విపత్తులు, క్లిష్ట సమయాల్లో ప్రజల ప్రాణ ఆస్తులను కాపాడటంలో పోలీసులు చూపుతున్న ధైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు.

పోలీసులకు హామీలు

పోలీసులపై ఉన్న పనిభారాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి నైపుణ్యాన్ని పెంచడం, వారి కుటుంబ సంక్షేమానికి అవసరమైన పథకాలను అమలు చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రజలు కూడా పోలీసులతో కలిసి నడుస్తూ, పరస్పర నమ్మకం, సామరస్యంతో సురక్షితమైన తమిళనాడు నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం విజయ్‌ పిలుపు నిచ్చారు.

అసెంబ్లీ సమావేశాలపై

ప్రజల్లో ఆసక్తి పెంచాం..

సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూడటానికి పిల్లల నుండి పెద్దల వరకు ఉదయాన్నే వేచి చూసే వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని పాఠశాల విద్య , సమాచార శాఖ మంత్రి రాజ్‌ మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం సి. విజయ్‌ నేతృత్వంలో ఒక కొత్త తరం రాజకీయాలపై అవగాహన పెంచుకుంటోందని ఆయన పేర్కొన్నారు. చైన్నెలో విలేకరులతో మాట్లాడిన మంత్రి రాజ్‌ మోహన్‌ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక తమిళనాడులో మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం విజయ్‌ చేసిన ప్రకటనపై ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారన్నారు. ఈ క్రీడపై ఆయనకున్న ఆసక్తికి, సీఎంపై ఉన్న నమ్మకానికి మంత్రి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో జరిగే చర్చలు, ప్రజా సమస్యలపై ప్రసంగాలను పిల్లలు కూడా ఆసక్తిగా చూస్తున్నారని, సినిమా డైలాగులు రీల్స్‌ చేసేవారు ఇప్పుడు శాసనసభ సంభాషణలను సోషల్‌ మీడియాలో రీల్స్‌గా మారుస్తున్నారని ఆయన చెప్పారు. రాజకీయాలను ప్రజా ఉద్యమంగా మార్చిన సీఎం విజయ్‌ చొరవను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని మంత్రి రాజ్‌ మోహన్‌ పిలుపునిచ్చారు.

నడిసముద్రంలో

మునిగిపోయిన నాటు పడవ

తిరువొత్తియూరు: రామనాథపురం జిల్లా సాయల్‌గుడి సమీపంలోని నరిప్పైయూర్‌ వేప్పమరత్తుప నై జాలర్లు గ్రామంలో 300కు పైగా మత్స్యకారు లు ఉన్నారు. వీరు దాదాపు 50కి పైగా నాటు పడవల్లో (సాంప్రదాయ పడవలు) సముద్రంలోకి చేపల వేటకు వెళ్తుంటారు. గత కొన్ని రోజులుగా మన్నార్‌ గల్ఫ్‌ (గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌) ప్రాంతంలో సముద్రం చాలా ఉధృతంగా ఉంది. అయినప్పటి కీ వేరే జీవనాధారం లేకపోవడంతో ఈ ప్రాంతాని కి చెందిన మత్స్యకారులు తమ నాటు పడవల్లో రోజూలాగే సముద్రంలోకి వేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు ఊహించని విధంగా సముద్రంలో గా లుల వేగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సముద్రపు ఉధృతిని తట్టుకోలేక, మత్స్యకారులు వెళ్లిన ఒక నాటు పడవ అటు ఇటూ ఊగుతూ, ఒక దశలో సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. నాటు పడవ మునిగిపోతుండటాన్ని గమనించి, ఆ పడవలో ఉన్న నలుగురు మత్స్యకారులు ప్రాణాలు ద క్కించుకోవాలనే ఉద్దేశంతో సముద్రంలోకి దూకా రు. నీటిలో వారు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, అదే ప్రాంతంలో చేపలు పడుతున్న ఇ తర మత్స్యకారులు వేగంగా అక్కడికి చేరుకుని, స ముద్రంలో మునిగిపోతున్న నలుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement