ఉడంగుడిలో వాణిజ్య విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఉడంగుడిలో వాణిజ్య విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

సాక్షి, చైన్నె: తూత్తుకుడి జిల్లా ఉడంగుడిలో నిర్మించిన అతిపెద్ద అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని మొదటి యూనిట్‌ నుండి 660 మెగావాట్ల పూర్తిస్థాయి వాణిజ్య విద్యుత్‌ ఉత్పత్తి విజయవంతంగా ప్రారంభమైందని తమిళనాడు విద్యుత్‌ బోర్డు ఆదివారం ప్రకటించింది. తమిళనాడు సీఎం సి. విజయ్‌ ఆదేశాల మేరకు, ప్లాంట్‌ పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడానికి వరుస పరిశీలనలు మరియు టెస్ట్‌ రన్‌లను అధికారులు నిర్వహించారు. మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం రూ.13,076 కోట్లు. ఇందులో రె ండు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో 660 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు.

72 గంటల నాన్‌స్టాప్‌ రికార్డు

నెల 2వ తేదీ సాయంత్రం 4.16 గంటల నుండి సెప్టెంబర్‌ 5 సాయంత్రం 4.15 గంటల వరకు వరుసగా 72 గంటల పాటు నిరంతరాయంగా 660 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. 72 గంటల ట్రయల్‌ విజయవంతం కావడంతో, శనివారం సాయంత్రం నుంచే ఈ ప్లాంట్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మొదటి యూనిట్‌ గత మార్చి 13న ప్రారంభమై, ప్రాథమిక పరిశోధనల సమయంలో రోజుకు 300 నుండి 400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ వచ్చింది. ఇక ఉడంగుడి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు చెందిన రెండో యూనిట్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలోనే అక్కడ కూడా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

విద్యుత్‌ ప్లాంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement