గ్రామసభలను బలోపేతం చేయండి! | - | Sakshi
Sakshi News home page

గ్రామసభలను బలోపేతం చేయండి!

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

● సీఎం విజయ్‌కు కమల్‌ హాసన్‌ లేఖ ● గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల బాధ్యతలకు తగినట్లుగా వారి నెలవారీ గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు నెలకు రూ. 16,000, ఉప సర్పంచ్‌ రూ. 10,000, వార్డు సభ్యులకురూ. 8 వేలు అంజేయాలని సూచించారు. ● గ్రామాల్లో కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేసే ముందు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేయాలి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న షాపునకు వ్యతిరేకంగా గ్రామసభ తీర్మానం చేస్తే దానిని మూసివేసే అధికారాన్ని కల్పించాలి. ● గ్రామసభల ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు కొన్ని ఉత్తమ గ్రామసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి. ● గ్రామసభ తీర్మానాలపై నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలి. గత సమావేశంలో ఆమోదించిన తీర్మానాలపై తీసుకున్న చర్యల నివేదికను తదుపరి గ్రామసభలో ప్రజల ముందుంచాలి. ● సమావేశానికి కనీసం 7 రోజుల ముందే ఎజెండాను విడుదల చేయాలి. స్థానిక ప్రజలు లేవనెత్తే అంశాలను కూడా చర్చనీయాంశాలుగా చేర్చే అవకాశం ఇవ్వాలి. ● స్థానిక స్వపరిపాలనపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అందించే శిక్షణను, పరిశోధనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ● గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలను ప్రజలే నేరుగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ● గ్రామసభలు కేవలం పేరుకే కాకుండా, ప్రజలు ప్రశ్నించి పాలనను జవాబుదారీగా మార్చే వేదికలుగా నిలవాలి. ● గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం కల నెరవేరాలంటే గ్రామసభలకు తగిన అధికారాలు కల్పించడమే మార్గమని కమల్‌ హాసన్‌ కోరారు.

సాక్షి, చైన్నె: తమిళనాడులో గ్రామసభలను మరింత బలోపేతం చేసి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు సర్శాదికారాలు కల్పించేలా చర్యలు తీ సుకోవాలని మక్కల్‌ నీది మయ్యం అధినేత, రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. వి జయ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. అక్టోబర్‌ 2న తమిళనాడు వ్యాప్తంగా గ్రా మసభల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, గ్రా మ పంచాయతీ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు ఆయన ఎనిమిది కీలక ప్రతిపాదనలను సీఎం దృష్టికి ఈ లేఖ ద్వారా తీసుకెళ్లారు.

కమల్‌ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement