సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని వివిధ పార్టీల కార్యాలయాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం ,డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సందేశాన్ని ఇచ్చారు. ఇక, ఆపార్టీల కార్యాలయాల వద్ద నేతలు జాతీయ జెండాను ఎగుర వేశారు. టీఎన్‌సీసీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో జరిగిన వేడుకకు రాష్ట్ర అధ్యక్షుడ మాణిక్యం ఠాకూర్ హాజరయ్యారు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా ఆయన పార్టీ కార్యాలయంలో జెండా ఎగుర వేసి గౌర వందనం అందుకున్నారు.ఇక, తమిళమానిల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్వార్‌పేటైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు జి.కె. వాసన్ జాతీయ జెండాను ఎగురవేసి, కేడర్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ఆర్. వెంకటేష్, రాణి కృష్ణన్, జి.పి. నంబి, ఉపాధ్యక్షులు విడియల్ శేఖర్, శక్తి వడివేల్, మునావర్ బాషా పాల్గొన్నారు.


