పళ్ళిపట్టు: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సంబరాలు అంబరాన్నంటాయి. పొదటూరుపేట బస్టాండులోని పార్కులో జాతిపిత విగ్రహానికి పళ్లిపట్టు మాజీ ఎమ్మెల్యే, టీఎంసీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రామన్ పూలమాళతో ఘనంగా నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. స్వాతంత్ర భారత దేశంకు సమరయోధుల పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పొదటూరుపేట టౌన్ పంచాయతీ కార్యాలయంలో పట్టణ పంచాయతీ చైర్మన్ రవిచంద్రన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పళ్లిపట్టు టౌన్ పంచాయతీలో పట్టణ పంచాయతీ కార్యనిర్వహణాధికారి అబూబక్కర్ త్రివర్ణ పధకాన్ని ఆవిష్కరించారు. తిరుత్తణి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో ఎమ్మెల్యే హరి జాతీయ జెండా వందనం చేశారు. ఇదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు.


