వీఐటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వీఐటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

వేలూరు: దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేయాలని వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సోవాన్ని పురస్కరించుకుని వీఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తుగల స్తంభంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాథన్‌ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మహాత్మాగాంఽధీ, వావూసి వంటి మహా నేతలకు పూల మాల వేసి స్వీట్లు పంచి పెట్టారు. దేశాభివృద్ధి ఉన్నత విద్య ద్వారానే సాధ్యమవుతుందని వీటికి దేశంలోని యువకులందరికీ ఉన్నత విద్య అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్‌ విశ్వనాథన్‌, కార్యనిర్వహణ డైరెక్టర్‌ సంధ్యా పెంటారెడ్డి, ఫ్రొ చాన్స్‌లర్‌ పార్థసారథి మల్లిక్‌, రిజిస్ట్రార్‌ జయభారతి, ఫ్రొఫెసర్‌లు, వివిధ దేశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement