పార్టీకి ఇల్లు దానం | - | Sakshi
Sakshi News home page

పార్టీకి ఇల్లు దానం

Aug 15 2026 12:52 AM | Updated on Aug 15 2026 12:52 AM

సాక్షి,చైన్నె: ట్రిప్లికేన్‌కు చెందిన దంపతులు తమ ఇంటిని సీపీఎం పార్టీకి దానంగా అందజేశారు. ట్రిప్లికేన్‌ ఐస్‌ హౌస్‌ డాక్టర్‌ నటేశన్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన అడ్వకేట్‌ ఇ.గోకులకృష్ణన్‌ , జి.జయంతి దంపతులు తమ సొంత ఇంటిని సీపీఎం పార్టీ మధ్య చైన్నె జిల్లా కమిటీకి దానంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఫిడెల్‌ క్యాస్ట్రో 100వ జయంతి వేడుకల సందర్భంగా వారు తమ ఇంటిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసి, పత్రాలను సీపీఎం రాష్ట్ర పి. షణ్ముగానికి అందజేశారు. కుటుంబ ఆస్తిని పార్టీ కార్యకలాపాల కోసం అందించిన ఆ దంపతులకు షణ్ముగం అభినందనలు తెలిపారు. మధ్య చైన్నె జిల్లా కార్యదర్శి జి. సెల్వా శాలువాతో సత్కరించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు తిరువేట్టై, కమిటీ సభ్యుడు సుందరం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement