సేలం : నామక్కల్– పెరంబలూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని డీఎంకే రాజ్యసభ ఎంపీ రాజేష్ కుమార్, నామక్కల్ లోక్‌సభ ఎంపీ మాతేశ్వరన్ ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం ఈ మేరకు వినతిపత్రం అందించారు. నామక్కల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొన్ని ప్రధాన రైల్వే ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ, అవి ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదన్నారు. పశ్చిమ , మధ్య తమిళనాడు జిల్లాల మధ్య రైలు అనుసంధానాన్ని (రైల్ కనెక్టివిటీ) మెరుగుపరచడానికి, సరుకు రవాణాను బలోపేతం చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధికి, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్టులు ఎంతగానో అవసరమని వివరించారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించాలని విన్నవించారు. తమిళనాడులో ఇప్పటివరకు రైల్వే లైన్ లేని ఏకై క జిల్లాగా ఉన్న పెరంబలూర్‌కు ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలిసారిగా రైలు సౌకర్యం లభిస్తుందని తెలిపారు.


