సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి ట్రా న్స్‌జెండర్ నాయకురాలు అప్సరా రెడ్డి గురువారం లేఖ రాశారు. ‘నా రాజకీయ ప్రయాణం ఇకపై వేరే మార్గంలో సాగవచ్చు’ అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నా రు. ఇటీవల కాలంలో అన్నాడీఎంకే నుండి పలువురు ఎమ్మెల్యేలు, కీలక నిర్వాహకులు వరుసగా బయటకు వెళ్తున్న తరుణంలో, ఇప్పుడు అప్సరా కూడా పార్టీని వీడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పళనిస్వామికి రాజీనామా లేఖ
‘బరువెక్కిన హృదయంతో అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారిపై ఉన్న అపారమైన గౌరవం, ప్రేమ, ఆమె రాజకీయ సిద్ధాంతాలపై నమ్మకమే నన్ను ఈ పార్టీ వైపు నడిపించాయి అని లేఖలో పర్కొన్నారు. అలాగే, ‘ నా రాజకీయ ప్రయాణంలో నాకు మీరు (పళనిస్వామి) అందించిన ప్రేమ, గౌరవం, నమ్మకం , రాజకీయ అవకాశాలకు నా హృదయపూర్వక కతజ్ఞతలు. అన్నాడీఎంకే నుండి వైదొలగాలనే నా నిర్ణయం ఎలాంటి చేదు అనుభవాల వల్లనో లేదా వ్యక్తిగత అసంతృప్తి వల్లనో తీసుకున్నది కాదు’ అని స్పష్టం చేశారు. నా జీవితంలో అన్నాడీఎంకేలో గడిపిన కాలం ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. నా రాజకీయ ప్రయాణం ఇకపై వేరే మార్గంలో సాగవచ్చు.. కానీ ప్రజల కోసం సేవ చేయాలనే నా ప్రధాన లక్ష్యం మాత్రం ఎప్పటికీ మారదు’ అని వివరించారు.
అప్సరా రాజకీయ ప్రస్థానం
గతంలో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలిత జీవించి ఉన్న సమయంలో అప్సరాను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. జయలలి త మరణం తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి, అఖి ల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తిరిగి అన్నాడీఎంకే గూ టికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూలైలో పళనిస్వామి ఆమెకు పార్టీ ప్రచార విభాగం డిప్యూటీ సెక్రట రీ పదవిని అప్పగించారు. పదవి చేపట్టిన కొద్ది రోజు లకే ఆమె పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.


