సాక్షి, చైన్నె : చైన్నె నగరంలో ’కళా ఉత్సవం’ పేరిట ఏ ర్పాటైన చేనేత, హస్తకళా ప్రదర్శనకు అనూహ్య స్పందన లభిస్తున్నది. ఓల్డ్ పల్లావరం, పెరుమాళ్ నగర్ లోని రేడియల్ రోడ్డు మురుగన్ టవర్స్ వేదికగా క్రాప్ట్ కొలువు దీర్చారు. దేశం నలుమూలల నుంచి చేనేత కళాకారులు , వివిధ వస్త్ర ఉత్పత్తి దారులు అంటూ బెంగాల్ కాటన్, కంచి కాటన్, హుబ్లీ కాటన్, చెట్టినాడు కాటన్, లడక్ సిల్క్, కాశ్మీరీ సిల్క్, పోచంపల్లి చీరల రకాలు కొలువు దీర్చారు. కాటన్ టాప్స్, హ్యాండ్ వర్క్ టాప్స్, సల్వార్ సూట్లు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా, గృహాలంకరణ కోసం ఎరక్రోట వస్తువులు, ఉడెన్ క్రాఫ్ట్ ఐటమ్స్, సిరామిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, ఫర్నిచర్ ఐటమ్స్, కిడ్స్ వేర్, కిడ్స్ ప్లే ఐటమ్స్, జువెలరీ రకాలు, ఇత్తడి కళారూపాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుందని, ఎంట్రీ, పార్కింగ్ ఉచితమని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.


