కొరుక్కుపేట: బ్రైడల్ మేకప్... ఫైర్‌లెస్, వైర్‌లెస్ కుక్కింగ్.. డూడ్లీ ఆర్ట్, పైప్ క్లీనర్స్ ఆర్ట్ అంటూ నాలుగు రకా ల పోటీల్లో విద్యార్థినిలు తమదైన ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థినిల్లో ప్రతిభను, సృజనాత్మకతను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ మ హిళా కళాశాలలోని కళాలయా ఫైన్ ఆ ర్ట్స్ ఆధ్వర్యంలో ఈషా –2026 పేరుతో రెండురోజుల పోటీలు గురువారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. కళాశాల ప్రాంగణంలో తొలిరో జు గురువారం ఉదయం జరిగిన ఆఫ్ స్టేజ్ ఈవెంట్‌లో బ్రైడెల్ మేకప్, ఫైర్‌లెస్ వైర్‌లెస్ కుక్కింగ్, పైప్ క్లీనర్స్ ఆర్ట్స్, డూడ్లీ ఆర్ట్ విద్యార్థినిలు ఎంతో ఉత్పాహంగా పాల్గొన్నారు. విద్యార్థినిలు తమదైన శైలిలో సృజనాత్మకతను చాటుకుని న్యాయనిర్ణేతలనే అబ్బుర పరచి మన్ననలు అందుకున్నారు. విజేతులుగా నిలిచిన విద్యార్థినిలకు షీల్డ్‌లు, సర్టిఫికెట్‌లను బహుమతులుగా అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వనజా మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఈషా పోటీలకు అనూహ్యమైన స్పందన లబిస్తోందన్నారు.


